మన తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు నార్త్ లోనే మన తెలుగు సినిమాలకు మార్కెట్ దక్కాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ మారుతున్న పరిస్థితులు, ప్రేక్షకులు సినిమాలు చూసే విధానంలో వస్తున్న మార్పుల వల్ల సినిమాకు లాంగ్వెజ్ బారియర్ లేకుండా అయిపోయింది. ఇక మన తెలుగు సినిమాలకు నార్త్ లో అంత క్రేజ్ రావడానికి పునాది వేసిన వాళ్లలో రాజమౌళి ఒకరు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు రాజమౌళి. ఆ తర్వాత నుండి చాలా మంది పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ముందుకొచ్చారు. ఇక ఈమధ్యకాలంలో పలు సినిమాలు దేశవ్యాప్తంగా తమ సత్తాను చాటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ వైడ్ గా కూడా రాజమౌళి తన సత్తాను చాటారు. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రంగా నిలిచింది. ఇక ఓటీటీ రిలీజ్ తో `ఆర్ఆర్ఆర్` స్థాయి ఒక్క సారిగా మారిపోయింది. హాలీవుడ్ లో సైతం ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది.
ఇప్పటికే ఈసినిమా చూసిన హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం తమకు ఎంతగానో నచ్చిందని, రాజమౌళితో కలిసి పని చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా వీరు దర్శకత్వం వహించిన అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి సినిమాలు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. తాజాగా రస్సో బ్రదర్స్.. మార్క్ గ్రేనీ నవల ఆధారంగా ‘ది గ్రే మ్యాన్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ధనుష్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ జూలై 15న థియేటర్లలో విడుదల కాగా జూలై 22న ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
ఇక తాజాగా రస్సో బ్రదర్స్ ఇంకా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఓటీటీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను చూసి నేను చాలా ఆశ్చర్యపోయా.. విదేశాల్లో ఈసినిమాకు ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది అని నేను అనుకోలేదు.. మంచి కథ అందరికీ మంచి కథే అవుతుంది.. నేను వెస్ట్రన్ సెన్సిబిలిటీస్ తో సినిమా తీయగలనని అనుకోవడంలేదు.. నన్ను నేను ఎప్పుడూ నమ్మలేదు కూడా కానీ ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తరువాత నేను నిజంగా చాలా సర్ ప్రైజ్ అయ్యాను అని తెలిపాడు.
ఇంకా జో రూసో మాట్లాడుతూ.. మేము యూనివర్శల్ ట్రూత్ కోసం చూస్తున్నాం.. అదే మా ప్రాధమిక లక్ష్యం.. నిజానికి ఆడియన్స్ ను స్టోరీటెల్లింగ్ బైండింగ్ ఎలిమెంట్ ద్వారా ఒకే తాటిపైకి తీసుకురావచ్చని చెప్పొచ్చు అని తెలిపారు. అంతేకాదు యాక్షన్ జానర్ అనేది వైడ్ జానర్ అని.. యాక్షన్ నేపథ్యంలో కథల ద్వారా ఆడియన్స్ ను కూడా రాబట్టవచ్చు.. యాక్షన్ అనేది యూనివర్శల్ లాంగ్వేజ్ అని తెలిపారు. ఎలాంటి మాటలు లేకుండా యాక్షన్ ద్వారా కూడా మనం చెప్పొచ్చు.. యాక్షన్ జానర్స్ కు రీసెంట్ ఇయర్స్ నుండే అందరికీ ఇంట్రెస్ట్ పెరిగిందని. కామెడీ జానర్లకు కొన్ని లిమిట్స్ ఉంటాయి.. దానికంటే కూడా కార్ ఛేజింగ్ లు, ఫైట్ సీక్వెన్స్ లే ఎక్కువగా అర్థమవుతాయి. గత కొంతకాలంగా యాక్షన్ జానర్ లలో పెరుగుతున్న ఆదరణ చూస్తున్నాం.. యాక్షన్ అనేది ప్రపంచ ప్రేక్షకులకు కనెక్ట్ చేసే ఒక భాష అని తెలిపారు.
The honour and pleasure are mine..🙏🏼 It was a great interaction . Looking forward to meet and learn a bit of your craft. https://t.co/NxrzuCv1w3
— rajamouli ss (@ssrajamouli) July 30, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.