కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Satyadev Movies

ట్యాగ్ · 38 కథనాలు

satyadev full bottle movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

సత్యదేవ్ ఫుల్ బాటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించే నటుల్లో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఎప్పుడూ ముందుంటాడు. ఒక పక్క హీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నాడు. ఈనేపథ్యంలో ఫుల్ బాటిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
Satyadev New Movie Titled As Zebra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Zebra,Zebra Movie,Zebra Telugu Movie,Zebra Update,Zebra Updates,Zebra Movie Updates,Zebra Movie Updat
సినిమా వార్తలు

సత్యదేవ్ పాన్ ఇండియా మూవీ టైటిల్ జీబ్రా

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సత్యదేవ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్న సత్యదేవ్ రీసెంట్ గా చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీలో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 25 సినిమాలు కంప్లీట్ చేసుకున్న సత్యదేవ్ తన 26 వ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Gurthunda Seethakalam Out Now On Amazon Prime Video,Satyadev,Tamannaah Bhatia,Nagasekhar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Gurthunda Seetakalam,Gurthunda Seetakalam Movie
ఓటీటీ

అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న గుర్తుందా శీతాకాలం

నాగశేఖర్ మూవీస్ , మణికంఠ ఎంటర్ టైన్ మెంట్స్ , శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్స్ పై నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కన్న‌డంలో విజ‌య‌వంత‌మైన లవ్ మాక్ టైల్ మూ వీ ఆధారంగా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం మూవీ 2022 డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో త‌మ‌న్నాతో పాటు కావ్య‌శెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా న‌టించారు. సుహాసిని , ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్రలలో నటించారు. కాలభైరవ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Talented Actor Satyadev Wants To Act In This Classic Remake, Satyadev Wants To Act In This Classic Remake, Talented Actor Satyadev, Actor Satyadev, Suhasini Maniratnam, Satyadev Kancharana, Tamanna Bhatia, Megha Akash, Kavya Shetty, Kala Bhairava, Na
సినిమా వార్తలు

ఆ క్లాసిక్ మూవీ రీమేక్ చేయాలని ఉంది

టాలీవుడ్ లో టాలెంటెడ్ నటులు చాలా మందే ఉన్నారు. వారిలో సత్యదేవ్ పేరు ముందు వరుసలోనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాందించుకున్నాడు సత్యదేవ్. పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసే సత్తా ఉన్న నటుడు. అందుకే ప్రస్తుతం కెరీర్ లో బిజీ అయిపోయాడు. ఒక పక్కహీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ఇటీవల గాడ్ ఫాదర్ లో తను ఒక కీలక పాత్రలో నటించగా ఆ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు హీరోగా వస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Tamannaah Looks Gorgeous At Gurthunda Seethakalam Pre Release Event, Gurthunda Seethakalam Pre Release Event, Tamannaah Looks Gorgeous, Gurthunda Seethakalam Pre Release, Suhasini Maniratnam, Satyadev Kancharana, Tamanna Bhatia, Megha Akash, Kavya Sh
సినిమా వార్తలు

గుర్తుందా శీతాకాలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా

తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం, చిరంజీవి భోళా శంకర్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీ లో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీ తో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Satyadev New Movie First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Satyadev,Hero Satyadev,Satyadev Movies,Satyadev Latest Movie Updates,Satyadev New Movie updates,Sat
ఫస్ట్ లుక్

సత్యదేవ్ "కృష్ణమ్మ" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకుని ప్రేక్షకుల్లో మంచి ఆధరణ సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్ కథానాయకుడిగా మరో మూవీ తెరకెక్కుతుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా యాక్షన్ డ్రామా "కృష్ణమ్మ "మూవీ తెరకెక్కింది. కాలభైరవ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Satyadevs Gurtunda Seethakalam Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Gurtunda Seethakalam,Gurtunda Seethakalam Telugu Movie,Gurtunda Seethakalam Mo
ట్రైలర్ & టీజర్

'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్ రిలీజ్

నాగ శేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Skylab Movie OTT Release Date Locked,Skylab OTT Release Date,Skylab OTT,Skylab OTT Release Date Update,Skylab OTT Release,Skylab Movie OTT,Skylab Movie OTT Release Date,Skylab Movie OTT Release,Skylab To Premiere On SonyLiv From 14th Jan,Skylab To Pr
ఓటీటీ

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'స్కైలాబ్'

సత్యదేవ్-నిత్యమీనన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్కైలాబ్. 1979 లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. డిసెంబర్ 4న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక సత్యదేవ్-నిత్యామీనన్ కాబట్టి.. తమ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఈసినిమాలో కూడా తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా మొదటిసారి ఈసినిమాతో నిర్మాతగా మారింది నిత్యామీనన్. ఇక మొదటి సినిమాతోనే మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ఇక ఈసినిమా కూడా త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా…

TFN Adminవాట్సాప్
Tamannaah And Satyadev’s Gurthundha Seethakalam Movie To Release In February 2022,Gurthundha Seethakalam Movie To Release In Theatres From February 2022,Gurthundha Seethakalam Movie To Release In February 2022,Gurthundha Seethakalam To Release In The
సినిమా వార్తలు

ఫిబ్రవరి ఫిక్స్ చేసుకున్న 'గుర్తుందా శీతాకాలం'

నాగశేఖర్ దర్శకత్వంలో స‌త్యదేవ్ హీరోగా, మిల్కీబ్యూటి త‌మన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాకు రీమేక్ ఇది. ఈసినిమా కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే మధ్యలో కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడటంతో షూటింగ్ కూడా లేట్ అయింది. దీంతో రిలీజ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. 2022 ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంకా చెప్పలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ…

TFN Adminవాట్సాప్
Nithya Menen And Satyadev’s Skylab Movie Release Teaser Is Out Now,Skylab Release Teaser,Nithya Menen,Satyadev,Rahul Ramakrishna,Vishvak Khanderao,Prithvi,Skylab Teaser,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Late
ట్రైలర్ & టీజర్

"స్కైలాబ్"మూవీ టీజర్ రిలీజ్

డాక్టర్ కె రవికిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్కైలాబ్ ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ మూవీ “స్కైలాబ్ “ డిసెంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. NASA ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్ (1979) కూలిపోయి భూమి సర్వ నాశనం అయిపోతుందని వార్తలు రావడంతో ప్రజలంతా ఏం జరుగుతుందోనని ఆసక్తి గా ఎదురుచూసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలోని గౌరి, ఆనంద్‌, రామారావు జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే నేపథ్యం లో “స్కైలాబ్ ” మూవీని…

Team TFNవాట్సాప్
I Am Eagerly Looking Forward To Do Challenging Roles Says Satyadev,Gurthunda Seethakalam,Gurthunda Seethakalam Movie,Godse,Skylab,Thimmarusu,Godse Movie,Godse Telugu Movie,Satyadev Godse,Satyadev Godse Movie,Skylab,Skylab Movie,Skylab Telugu Movie,Sk
సినిమా వార్తలు

ఛాలెంజింగ్ పాత్రలకై ఎదురుచూస్తున్నా - సత్యదేవ్

విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం”, “గాడ్సే”, “స్కైలాబ్ ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “రామ్ సేతు” హిందీ , చిరంజీవి "గాడ్ ఫాదర్ " మూవీస్ లో సత్యదేవ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సత్యదేవ్ కథానాయకుడిగా తెరకెక్కిన “స్కైలాబ్ ” మూవీ డిసెంబర్ 4వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు . స్కైలాబ్ " మూవీ సిట్యువేషనల్ కామెడీ మూవీ అనీ , తాను నటిస్తున్న తొలి వినోదాత్మక చిత్రమనీ , ఎక్కువగా సీరియస్‌ పాత్రలు చేస్తూ వచ్చాననీ , ఈ మూవీ లో తన పాత్ర ఫన్నీ గా ఉంటుందనీ, ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికాననీ చెప్పారు.

Team TFNవాట్సాప్
Natural Star Nani's Best Wishes To Skylab Movie Team,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Skylab 2021 Latest Telugu Movie,Skylab Latest Movie,Skylab Trailer,Nithya Menen,Satyadev,Rahul Ramakrishna
సినిమా వార్తలు

'స్కైలాబ్' సక్సెస్ కు స్కై లిమిట్ అవ్వాలి

విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో సత్యదేవ్-నిత్యమీనన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కైలాబ్. 1979 సంవ‌త్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్ర‌మైన ప‌రిస్థితులు జరిగాయి.. ఆ సంఘటనల నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఇక మొదటి నుండీ సత్యదేవ్- నిత్య మీనన్ ఇద్దరూ మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటారు.. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.

TFN Adminవాట్సాప్
No Change For Satyadev Character In Chiranjeevi’s Godfather Movie,Chiranjeevi,Chiranjeevi 153th Movie,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi New Movie Godfather,Chiranjeevi Next Movie,Ch
సినిమా వార్తలు

'గాడ్ ఫాదర్' సత్యదేవ్ పాత్రలో మార్పు లేదు

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్ తో వస్తుంది. ఇక ఈసినిమాలో ఇంకా పలు కీలక పాత్రలు ఉండగా ఆ పాత్రల్లో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు క్లారిటీ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మలయాళంలో మంజు వారియర్‌ పాత్రను తెలుగులో నయన్‌, ఆమె భర్తగా వివేక్ ఒబెరాయ్‌ పాత్రను సత్యదేవ్‌ పోషిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Hero Satyadev In Vedantham Raghavaiah Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Satyadev,Hero Satyadev,Actor Satyadev,Satyadev Movies,Satya
సినిమా వార్తలు

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్

పలు మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యదేవ్ "బ్లఫ్ మాస్టర్"మూవీ తో హీరోగా మరారు. సక్సెస్ ఫుల్ "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం", "గాడ్సే", "స్కైలాబ్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. "రామ్ సేతు" హిందీ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Nithya Menen And Satyadev Starrer Skylab Movie Trailer Is Out Now,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,
ట్రైలర్ & టీజర్

'స్కైలాబ్' ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరనుండి ఇప్పుడు హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే మొత్తానికి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా తిమ్మరుసు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్ ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. అందులో స్కైలాబ్ సినిమా కూడా ఉంది. విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సినిమా స్కైలాబ్.

TFN Adminవాట్సాప్
Satyadev and Nithya Menen Starrer Skylab Enters Post Production Stage,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tamannaah,Tamannaah Movies,Skylab,Skylab Movie,Skylab Telugu Movie,Skylab Movie Updates,Skylab Movie News,Skylab Movie Latest Updates,Sky
సినిమా వార్తలు

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో "స్కై లాబ్ "

బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్య మీనన్‌ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వంలో సత్యదేవ్‌, నిత్యామీనన్, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో"స్కైలాబ్‌" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. "స్కైలాబ్‌" మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. ఆదివారం చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Satyadev Kickstarts His Landmark Movie Presented By Koratala Siva,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Satyadev25,Satyadev25 Movie,Satyadev25 Officially Launched,Satyadev25 Movie Officially Launched,Satya
సినిమా వార్తలు

కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేసిన సత్యదేవ్

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ మొత్తానికి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. అటు తెలుగులోనే కాదు హిందీ లో కూడా అవకాాశాలను చేజిక్కించుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా తిమ్మరుసు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్ ప్రస్తుతం తెలుగులో గుర్తుందా శీతాకాలం,‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలు షూటింగ్ కూాడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.

TFN Adminవాట్సాప్
Satyadev Latest Release Thimmarusu Movie Making Video Is Out Now,Thimmarusu Movie Making,Satyadev,Priyanka Jawalkar,Brahmaji,Sricharan,Sharan Koppisetty,Thimmarusu Latest 2021 Telugu Movie,Thimmarusu Telugu Movie Review,Telugu Filmnagar,Thimmarusu Mo
సినిమా వార్తలు

'తిమ్మరుసు' మేకింగ్ వీడియో రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ మొదటినుండి డిఫరెంట్ గా ఉండే కథలనే ఎంచుకుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తిమ్మరుసు తో మరోసారి విభిన్నమైన కథతో వచ్చి తన సత్తా ఏంటో చూపించాడు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకోగా విడుదలైన మొదటి సినిమా తిమ్మరుసు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాలో సత్యదేవ్ నటన, కథపై డైరెక్టర్ గ్రిప్పింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇక రిలీజ్ అయిన దగ్గరనుండి ఈసినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్