విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో సత్యదేవ్-నిత్యమీనన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కైలాబ్. 1979 సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరిగాయి.. ఆ సంఘటనల నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఇక మొదటి నుండీ సత్యదేవ్- నిత్య మీనన్ ఇద్దరూ మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటారు.. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా డిసెంబర్ 4న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించగా దానికి న్యాచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా టీమ్ అందరిలో టెన్షన్ చూస్తాం.. కానీ ఇక్కడ ఎవరిలో సినిమా రిజల్ట్ పై టెన్షన్ లేదు.. అందరూ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు.. కొన్ని కొన్ని సినిమాలకు అలా కలిసొస్తాయి.. ఒక్కొక్కరి గురించి వాళ్లు మాట్లాడుతుంటే ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుంది. ఈసినిమా పోస్టర్లు, విజువల్స్ అన్నీ చూశాక ఈసినిమా చాలా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. చిన్నప్పుడు స్కైలాబ్ గురించి నేను కూడా విన్నాను.. విశ్వక్ ముందు నాకు కథ చెబుదామనుకున్నాడట.. కానీ కుదరలేదు.. ఫైనల్లీ నిత్య మీనన్ చేతిలో.. మంచి టీమ్ లో పడింది కాబట్టి బాధలేదు. ఇక నిత్య నేను అలా మొదలైంది సినిమా చేసి దాదాపు పదేళ్లు అవుతుంది.. ఈసినిమా చాలా చిన్నపిల్లల్లాగా చేశాం.. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా.. ఏ లాంగ్వేజ్ లో చేసినా నిత్య సూపర్ యాక్ట్రెస్ అన్న పేరు తెచ్చుకుంది.. ఈసినిమాతో నిర్మాతగా కూడా మారిపోయింది.. ముందు ముందు కూడా ఎన్నో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. ఇక సత్యదేవ్ కూడా ఒక స్టార్ యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.. తను ఎంచుకునే సినిమాలు చాలా బావుంటాయి. తన లాగ బాగా నటించేవాళ్లు ఇంకా రావాలి అంటూ.. ఈసినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని చిత్రయూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు.
కాగా ఈసినిమాలో రాహుల్ రామకృష్ణ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: