బైట్ ఫ్యూచర్స్, నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో”స్కైలాబ్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “స్కైలాబ్” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. ఆదివారం చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా దర్శకుడు విశ్వక్ మాట్లాడుతూ.. ‘1979 సంవత్సరం లో నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందనీ , భూమి మొత్తం నాశనమైపోతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలో ఏం జరిగింది , ఆ ఊరిలోని గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయి? అనేది ఈ చిత్ర కథాంశమనీ , ఈనెలలోనే ట్రైలర్ విడుదల చేస్తామనీ చెప్పారు. “స్కైలాబ్” మూవీ కి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: