
ట్యాగ్ · 115 కథనాలు · పేజీ 5


యశోద ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

యశోద మూవీ కై సమంత రిస్కీ ఫైట్స్

యశోద రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్స్ హవా

సామ్ బ్యాక్ టు సోషల్ మీడియా

బాలీవుడ్ హారర్ మూవీ లో సమంత ?

వరలక్ష్మికి 'యశోద' టీమ్ స్పెషల్ విషెస్

12 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎన్నో అనుభూతులు..!

'కాతు వాకుల రెండు కాదల్' టీజర్ రిలీజ్

'కాతు వాకుల రెండు కాదల్' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

సమంత సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్..!

సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన సమంత 'యశోద'

'శాకుంతలం'.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు

'శాకుంతలం' ఒక మ్యాజికల్ మూవీ

ఎన్టీఆర్ కు జోడీ గా సామ్.. ఇదే క్లారిటీ..!

సమంత యశోద ట్రైలర్ రిలీజ్
ఈమధ్యకాలంలో సమంత లేడీ ఒరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఈనేపథ్యంలోనే తెలుగులో వస్తున్న సినిమాలు శాకుంతలం, యశోద సినిమాలు. శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు యశోద సినిమా మాత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది. హరి, హరీష్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నవంబర్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

దీపావళి పండగ సందర్భంగా న్యూ మూవీస్ పోస్టర్స్ రిలీజ్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన యశోద మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

యశోద ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత దశాబ్దానికి పైగానే ఇండస్ట్రీని ఏలింది. చివరిగా తెలుగులో సమంత ‘జాను’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత రెండేండ్లుగా ఎలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. అందులో యశోద సినిమా కూడా ఒకటి. హరి, హరీష్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా యశోద. సమంత అభిమానులు చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

యశోద మూవీ కై సమంత రిస్కీ ఫైట్స్
స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన యశోద , శాకుంతలం మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సమంత ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక…

యశోద రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా యశోద. హరి-హరీష్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేఫథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ అలానే టీజర్ ను రిలీజ్ చేయగా అవి చాలా ఆకట్టుకున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తున్నట్టు అర్థమవుతుంది.

బాలీవుడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్స్ హవా
టాలీవుడ్ , కోలీవుడ్ లలో సమంత ,నయనతార, రష్మిక , పూజా హెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమ అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. వీరు తమ ట్యాలెంట్ తో బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.

సామ్ బ్యాక్ టు సోషల్ మీడియా
ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత. ఇక మొదటి సినిమాతోనే అందరినీ మాయ చేసేసి ఆతరువాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఏదిగింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు హోస్ట్ గా అలానే బిజినెస్ రంగంలో కూడా సామ్ అడుగుపెట్టి ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకుంది. ఇక సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు వేయడంలో సామ్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవల సామ్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా చైతుతో విడిపోయిన తరువాత దూరంగా ఉంటున్నా.. అప్పుడప్పుడు…

బాలీవుడ్ హారర్ మూవీ లో సమంత ?
స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన యశోద, మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఖుషి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఒక హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

విజయ్-సామ్ 'ఖుషి' ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్..!
ప్రస్తుతం వస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతది కూడా ఒకటని చెప్పొచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మజిలీ మూవీ తర్వాత సామ్, శివ నిర్వాణ కాంబోలో మూవీ కావడం, విజయ్ హీరో కావడంతో సినిమా పైన మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కశ్మీర్ లో కొంతవరకూ షూటింగ్ ను జరుపుకుంది.

200 మిలియన్ వ్యూస్ తో సమంత స్పెషల్ సాంగ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ”పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌తో గానం చేసిన, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఊ అంటావా.. ఊఊ అంటావా” స్పెషల్ సాంగ్ విమర్శలు ఎదుర్కొన్నా యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

వరలక్ష్మికి 'యశోద' టీమ్ స్పెషల్ విషెస్
"పోడాపోడి "మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. "తెనాలి రామకృష్ణ BABL" మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, "NBK107 ", "యశోద", "హనుమాన్ "మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

12 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎన్నో అనుభూతులు..!
ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకులను తన అందం, అభినయంతో మాయ చేసి.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. ఇక అప్పటినుండి ఇప్పటివరకూ తను కెరీర్ పరంగా రోజు రోజుకు దూసుకుపోతుందే తప్పా ఎక్కడా వెనుకడుగు వేసింది లేదు. ఇక ఇన్నేళ్ల కెరీర్ లో సామ్ ఎన్నో పాత్రల ద్వార నవ్వించింది.. ఏడిపించింది.. అంతేకాదు మహిళా ప్రాధాన్యమైన సినిమాలు చేసి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. మెప్పించింది. ఇక పెళ్లైన తరువాత సమంత పూర్తిగా పాత్ర ప్రధానమైన.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనలోని విభిన్నత చూపిస్తుంది. అయితే రీసెంట్ గానే విహాహబంధం నుండి విడిపోయి కొత్త…

"శాకుంతలం " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

'కాతు వాకుల రెండు కాదల్' టీజర్ రిలీజ్
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఈ కాతు వాకుల రెండు కాదల్ సినిమా వస్తుంది. ఇక ఈసినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి, నయనతార, సమంత లు ముగ్గురు స్టార్ హీరో హీరోయిన్స్.. ఇక వాళ్లు ఎంచుకునే పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఈసినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అంతేకాదు కాదు ఈసినిమా కోసం అటు తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకుంటూనే మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. .

'కాతు వాకుల రెండు కాదల్' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయతార లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా చిత్రం కాతువాకుల రెండు కాదల్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. నిన్ననే ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న క్రికెటర్ శ్రీశాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రబృందం.. నేడు ఈసినిమా టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. ఈ…

సమంత సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్..!
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార,సమంత ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది కూడా. ఇప్పటికే ఈసినిమా నుండి హీరో హీరోయిన్స్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. ఇక రీసంట్ గానే ఈసినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఈసినిమా నుండి టీజర్ ను 11వ తేదీన రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.

సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన సమంత 'యశోద'
సౌత్ ఇండస్ట్రీలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ సినిమాలను చేస్తుంది. దీనిలో భాగంగానే సమంతతో కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు మేకర్స్. ప్రస్తుతానికి అయితే సమంత పలు సినిమాలతో బిజీగా ఉంది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

'శాకుంతలం'.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈనేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరంసందర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు. ఇక ఈసినిమాకు గ్రాఫిక్ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి.. ఈవీడియోలో చూస్తుంటే దీనికోసం చాలామందే పని చేస్తున్నట్టు అర్థమవుతుంది.

'శాకుంతలం' ఒక మ్యాజికల్ మూవీ
టాలీవుడ్ స్టార్ హీరో సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోను వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతుంది. ఇక ప్రస్తుతం సామ్ తెలుగులో నటించిన సినిమా శాకుంతలం. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. రుద్రమదేవి లాంటి సినిమా తరువాత గుణశేఖర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.

ఎన్టీఆర్ కు జోడీ గా సామ్.. ఇదే క్లారిటీ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా 2018 లో ‘అరవింద సమేత’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించాడు ఎన్టీఆర్. ఇక దాదాపు మూడేళ్లకు పైగా ఈసినిమాతోనే బిజీగా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు ఎంత బజ్ క్రియేట్ అయిందో చూశాం. దానికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా భారీగా చేస్తున్నాడు రాజమౌళి. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఎక్కడా తగ్గకుండా చిత్రయూనిట్ మొత్తం ప్రమోషన్స్ చేస్తుంది. ఇక రాజమౌళి మ్యాజిక్ ను చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.