సమంత యశోద ట్రైలర్ రిలీజ్

samanthas yashoda movie trailer out now, Samantha Shines As A Surrogate Mother, Yashoda Telugu Trailer Out Now, Yashoda Trailer Out Now, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hari, Harish, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Yashoda, Yashoda Telugu movie, Yashoda New Update, Yashoda Telugu Movie New Update, Yashoda Movie, Yashoda Latest Update, Yashoda Movie Updates, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie Latest News, Yashoda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈమధ్యకాలంలో సమంత లేడీ ఒరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఈనేపథ్యంలోనే తెలుగులో వస్తున్న సినిమాలు శాకుంతలం, యశోద సినిమాలు. శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు యశోద సినిమా మాత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది. హరి, హరీష్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నవంబర్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో రిలీజ్ చేయించారు మేకర్స్. తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళ్ ట్రైలర్‌ సూర్యతో, కన్నడ ట్రైలర్ ను రక్షిత్ శెట్టితో, మలయాళంలో దుల్కర్ సల్మాన్, వరుణ్‌ ధావన్‌తో హిందీ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ట్రైలర్ మాత్రం సూపర్ గా ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.