
ట్యాగ్ · 331 కథనాలు · పేజీ 2


కృతి సనన్ తో డేటింగ్ రూమర్స్ పై ప్రభాస్ క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్స్

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

పలు సర్ ప్రైజ్ లతో ప్రభాస్ బర్త్ డే

ప్రభాస్ బ్యాక్ టు సలార్ సెట్స్


రాధేశ్యామ్ ప్రభాస్ అన్ సీన్ ఫొటో

3D ఫార్మాట్ పనుల్లో బిజీగా ఆదిపురుష్

ప్రభాస్-మారుతి మూవీ గ్రాండ్ లాంచ్

ప్రభాస్-మారుతి సినిమా రేపే ప్రారంభం

కార్తికేయ2 టీమ్ కు కంగ్రాట్స్

సలార్ రెండు రోజుల్లో అప్ డేట్

సెప్టెంబర్ నెల నుండి "ఆదిపురుష్" ప్రమోషన్స్

ప్రభాస్ "సలార్" మూవీ న్యూ టార్గెట్

హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది - కిచ్చా సుదీప్

'ప్రాజెక్ట్K' రిలీజ్ డేట్ అప్ డేట్..!

ఆహా లో ఓహో అనిపించిన ప్రభాస్ ఎపిసోడ్ 1
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్ , యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయదానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.మొదటి భాగం 29 వ తేదీ రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, హీరో ప్రభాస్ ఫ్యాన్స్ సందడికి ఆ యాప్ క్రాష్ అయ్యిపోయింది.ఇది హీరో ప్రభాస్ పై ఉన్న క్రేజ్ కు నిదర్శనం.

కృతి సనన్ తో డేటింగ్ రూమర్స్ పై ప్రభాస్ క్లారిటీ
ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2. ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్ , యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయదానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.మొదటి భాగం నిన్న రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.బాలకృష్ణ అయితే ప్రభాస్‌ని పెళ్లి, ప్రేమ విషయాలు గురించి అడిగారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్స్
పాన్ ఐడియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2. ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్ , స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయదానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆది పురుష్. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో చేస్తున్నాడు. అయితే ఈసినిమా నుండి ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో అని ప్రభాస్ లుక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

పలు సర్ ప్రైజ్ లతో ప్రభాస్ బర్త్ డే
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ను పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ప్రభాస్ బ్యాక్ టు సలార్ సెట్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్…

సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ప్రభాస్ , అల్లు అర్జున్ , రానా ల త్రో బ్యాక్ ఫొటో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పుష్ప :ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దేశవ్యాప్తంగా క్రేజ్ పెంపొందించుకున్న అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప:ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న హిరణ్య కశ్యప మూవీ పనులలో రానా బిజీగా ఉన్నట్టు సమాచారం.

దేశంలోనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రాజెక్ట్ K
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

హీరో ప్రభాస్ బర్త్ డే కు వర్షం , బిల్లా మూవీస్ రీ రిలీజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల బర్త్ డేస్ కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ ను నూతన టెక్నాలజీ తో రీరిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే . సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి మూవీ 4k తో స్పెషల్ షోస్ వేయగా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానామొగుడు చిత్రాన్ని విడుదల చేయగా.. దానికి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా జల్సా సినిమాను రీరిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

రాధేశ్యామ్ ప్రభాస్ అన్ సీన్ ఫొటో
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.రాధేశ్యామ్ మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్…

3D ఫార్మాట్ పనుల్లో బిజీగా ఆదిపురుష్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో హీరో ప్రభాస్ నటించిన…

ప్రాజెక్ట్ కే కోసం మోస్ట్ హ్యాపెనింగ్ స్టంట్ మాస్టర్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ -నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ అందరూ పాన్ ఇండియా అంటుంటే.. ఇప్పుడు ఈసినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈసినిమా కోసం నాగ్ ఆశ్విన్ ఇప్పటికే రీసెర్చ్ లు కూడా చేశాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ప్రభాస్-మారుతి మూవీ గ్రాండ్ లాంచ్
ఒకపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోపక్క మినిమం బడ్జెట్ తో కామెడీ కమర్షియల్ తీసి పలు హిట్స్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ మారుతి. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆసక్తిరమైన విషయమే. ఎందుకంటే ప్రభాస్ కు ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ వచ్చింద్ కాబట్టి తను చేసే సినిమాలు మ్యాగ్జిమమ్ భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయి. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు సైతం నిర్మాతలు భారీ బడ్జెట్ తో మాత్రమే సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి నేపథ్యంలో మారుతి తో సినిమా అంటే ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతిఒక్కరూ…

ప్రభాస్-మారుతి సినిమా రేపే ప్రారంభం
బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఎంత మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మొత్తం పాన్ ఇండియా సినిమాలే. అందులో ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తుండగా ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. అలానే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తుండగా ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

కార్తికేయ2 టీమ్ కు కంగ్రాట్స్
ఒకప్పుడు సీక్వెల్ సినిమాలంటే సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు సీక్వెల్ సినిమాలు కూడా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాయి. ఈఏడాదే వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక రీసెంట్ గా కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ2 కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతుంది. ఈసినిమా రిలీజ్ వరకూ కూడా చాలా సమస్యలే ఎదుర్కొంది. సినిమా షూటింగ్ అప్పుడు కరోనా వల్ల సమస్యలు.. అయినా కూడా కష్టపడి ఆ హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుంది. ఇక రిలీజ్ చేద్దామనుకున్న టైమ్ లో మళ్లీ థర్డ్ వేవ్ రావడం వల్ల ఆగిపోయింది. ఇక ఫైనల్ గా ఈనెల 13న అన్ని…

సలార్ రెండు రోజుల్లో అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక దీనితో పాటు సలార్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. ఇక మొత్తానికి మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టి కంప్లీట్ చేస్తున్నారు.

సెప్టెంబర్ నెల నుండి "ఆదిపురుష్" ప్రమోషన్స్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటించిన…

ప్రభాస్ "సలార్" మూవీ న్యూ టార్గెట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రెండు భారీ చిత్రాలు "సలార్", "ప్రాజెక్ట్ K" సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్…

హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది - కిచ్చా సుదీప్
పలు బ్లాక్ బస్టర్ కన్నడ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ కిచ్చా సుదీప్ శాండల్ వుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. “ఈగ”, “బాహుబలి”, “సైరా నరసింహారెడ్డి” చిత్రాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుదీప్ తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరో సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా…

'ప్రాజెక్ట్K' రిలీజ్ డేట్ అప్ డేట్..!
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో ఇప్పటికే ఓం దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా సలార్ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. వీటితో పాటు నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే ఈసినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందించనున్నట్టు సినిమాను ప్రకటించినప్పుడే తెలిపారు. ఇక ఇప్పుడు అదే చెబుతున్నాడు నిర్మాత అశ్వినీదత్.