కార్తికేయ2 టీమ్ కు కంగ్రాట్స్

Prabhas Congratulates Team Karthikeya 2,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas About Karthikeya 2 Movie,Prabhas Congratulates Karthikeya 2 Movie Team,Prabhas About karthikeya 2 Movie, Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates,Prabhas Salaar Movie updates,Prabhas Salaar Movie Latest News,Prabhas Project K Movie Updates,Prabhas Adipurush Movie Latest Updates

ఒకప్పుడు సీక్వెల్ సినిమాలంటే సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు సీక్వెల్ సినిమాలు కూడా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాయి. ఈఏడాదే వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక రీసెంట్ గా కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ2 కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతుంది. ఈసినిమా రిలీజ్ వరకూ కూడా చాలా సమస్యలే ఎదుర్కొంది. సినిమా షూటింగ్ అప్పుడు కరోనా వల్ల సమస్యలు.. అయినా కూడా కష్టపడి ఆ హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుంది. ఇక రిలీజ్ చేద్దామనుకున్న టైమ్ లో మళ్లీ థర్డ్ వేవ్ రావడం వల్ల ఆగిపోయింది. ఇక ఫైనల్ గా ఈనెల 13న అన్ని సినిమాల రిలీజ్ డేట్లు చూసుకొని రిలీజ్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మొత్తానికి తమ కష్టానికి ఫలితం దక్కింది. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దేశవ్యాప్తంగా కూడా ఈసినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని రోజు రోజుకూ.. థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలాఉండగా ఈసినిమా హిట్ పై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించి అభినందనలు తెలియచేశారు. ఈనేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినందుకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కంగ్రాట్స్ చెప్పారు.

కాగా చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ పతాకాల పై సంయుక్తం గా నిర్మించిన ఈసినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =