ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Adipurush Movie Teaser Release Date Fixed,Adipurush Movie Teaser Release Date Is Officially Confirmed,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Telugu Movie Latest Updates,Adipurush Pan India Movie,Adipurush Movie Teaser Updates,Adipurush Pan India Movie Teaser Release Date Confirmed Officially,Pan India Star Prabhas,Rebel Star Prabhas,Prabhas,Prabhas Upcoming Movie Adipurush,Prabhas Adipurush Movie Teaser Release Date Fixed,Prabhas Adipurush Movie Teaser Release Date Officially Announced

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆది పురుష్. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో చేస్తున్నాడు. అయితే ఈసినిమా నుండి ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో అని ప్రభాస్ లుక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆదిపురుష్ టీజర్ గురించి ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా టీజర్ ను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు పలు వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న వెయిటింగ్ కి ఇప్పుడు తెర పడింది. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. అక్టోబర్ 2వ తేదీన ఈసినిమా టీజర్ చేయనున్నారు. అంతేకాదు ఆరోజే సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ సహా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ ఏడాది ఢిల్లీ లో జరిగే ప్రతిష్టాత్మక దసరా మహోత్సవాలు లో ప్రభాస్ పాల్గొనడం కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ల‌వ్‌కుశ్ రాంలీలా క‌మిటీ ఎర్రకోట వ‌ద్ద అయోధ్య‌లోని రామాల‌యం థీమ్‌పై మండ‌పాన్ని ఏర్పాటు చేస్తోంది. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి చిహ్నంగా రావణుడి దిష్టి బొమ్మ‌ను ద‌గ్ధం చేయడం ఈ కమిటీ ఆనవాయితీ. 10 తలల రావణాసురుడి భారీ విగ్రహాన్ని దగ్ధం చేయడానికి సెలబ్రిటీలను ఈ కమిటీ ఆహ్వానిస్తుంటుంది. ఈ ఏడాది ప్రభాస్‌కు ఆహ్వానం అందింది.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈసినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.