‘ప్రాజెక్ట్K’ రిలీజ్ డేట్ అప్ డేట్..!

Project K Release Date Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Pan India Movie,Project K Movie latest Updates,Prabhass Project K Movie Release Date Fixed, Project K Mvoie latest Updates,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Pan Indian Star Prbhas upcoming movie Project K Release Date

ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో ఇప్పటికే ఓం దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా సలార్ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. వీటితో పాటు నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే ఈసినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందించనున్నట్టు సినిమాను ప్రకటించినప్పుడే తెలిపారు. ఇక ఇప్పుడు అదే చెబుతున్నాడు నిర్మాత అశ్వినీదత్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతి మూవీస్ బ్యానర్ లో సీతారామం సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇక తాజాగా ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌ లోనే నిర్మించారు. ఈనేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినీదత్ ఈసినిమా గురించి పలు విషయాలు తెలియచేశారు. అంతేకాదు తమ బ్యానర్ లోనే వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా గురించి కూడా సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా హాలీవుడ్‌ సినిమా లను మించి ఉంటుందనే నమ్మకం ఉందని అన్నారు. అంతేకాదు హాలీవుడ్ సినిమా అవెంజర్స్ కు ఏమాత్రం తగ్గకుండా నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్నాడని.ఈసినిమా రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 18వ తేదీన లేదంటే జనవరి 2024లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.