పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ -నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ అందరూ పాన్ ఇండియా అంటుంటే.. ఇప్పుడు ఈసినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈసినిమా కోసం నాగ్ ఆశ్విన్ ఇప్పటికే రీసెర్చ్ లు కూడా చేశాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చోటుచేసుకుంది. అదేంటంటే..
ఈ సినిమా కోసం ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్ లు రంగంలోకి దిగారు. వారెవరో కాదు.. కె.జి.యఫ్, ఖిలాడీ, రీసెంట్ గా విక్రమ్ చిత్రాల్లో అత్యద్భుతమైన ఫైట్స్ డిజైన్ చేసిన అన్నతమ్ములు అన్బరివ్. వీరిద్దరికీ ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని మేకర్స్ కూడా కన్ఫామ్ చేశారు.ఇక మరి వీరు ఈ సినిమాలో అయితే ఎలాంటి స్టన్నింగ్ సీన్స్ డిజైన్ చేస్తారో చూడాలి.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: