
ట్యాగ్ · 713 కథనాలు · పేజీ 8


RC 16 మూవీ అప్డేట్

గేమ్ చేంజర్ షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ హైలెట్ గా 500 మంది ఫైటర్ల క్లైమాక్స్

రామ్ చరణ్ నా సొంత కొడుకు లాంటి వాడు

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ చరణ్

చరణ్ తో కలిసి తప్పకుండా సినిమా చేస్తా

మీకు నచ్చిన బెస్ట్ ఫస్ట్ లుక్?

గేమ్ ఛేంజర్- హీరో, విలన్ పై కీలక సన్నివేశాలు

మెగా ప్రిన్సెస్ కోసం మెగా నర్సరీ

ఫైటింగ్ సీక్వెన్స్ తో గేమ్ ఛేంజర్ షూట్ షురూ

గేమ్ ఛేంజర్- భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూట్ కు రెడీ

చరణ్-దీపికా సీక్రెట్ ప్రాజెక్ట్

ఆస్కార్ జ్యూరీలో RRR కు పెద్ద పీట

ప్రతి తండ్రిలాగే నేనూ ఫీలయ్యా

రామ్ చరణ్ ఆర్‌సీ16పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చి బాబు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఉప్పెన' సినిమా అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు సానాకు ఇదే తొలిచిత్రం కావడం గమనార్హం. దీంతో మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకొని బుచ్చి బాబు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఈ సందర్భంగా బుచ్చి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో 'ఉప్పెన' సినిమాకు అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన ఆయన తొలి సినిమాతోనే గొప్ప లక్ష్యాన్ని అందుకున్నానని తెలిపారు. ఈ విజయంతో ఒక దర్శకుడిగా తనపై బాధ్యత మరింత పెరిగిందని, ఇకపై తాను చేయబోయే సినిమాల విషయంలో అప్రమత్తంగా…

69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఈ చలనచిత్ర పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడగా.. 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పలు విభాగాల్లో అనేక అవార్డులను కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో 10 జాతీయ అవార్డులు దక్కించుకుని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది తెలుగు సినిమా.

చంద్రయాన్ 3 సక్సెస్‌పై స్పందించిన టాలీవుడ్ సెలెబ్రిటీలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన 'చంద్రయాన్ 3' మిషన్ సూపర్ సక్సెస్ అయింది. తద్వారా రోదసిలో ఇప్పటివరకు మరే దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'ఇస్రో' విక్రమ్ ల్యాండర్‌ను దించింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి తొలి చంద్రుడి తొలి ఫోటోను పంపించింది. కాగా ఇప్పటివరకూ చంద్రునిపైకి అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోవర్లను పంపాయి.

గాంఢీవధారి అర్జున రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'గాంఢీవధారి అర్జున'. వరుణ్ తేజ్ తొలి సినిమా నుంచీ ఇతర హీరోలకు భిన్నంగా వినూత్న కథాంశాలను ఎంపిక చేసుకుంటూ జయాపజయాలతో నిమిత్తం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా.. ఈరోజు సాయంత్రం రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దీనిని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిర్వహించడం విశేషం.

RC 16 మూవీ అప్డేట్
ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సన.ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ ఏకంగా స్టార్ హీరో ను డైరెక్ట్ ఛాన్స్ కొట్టేశాడు.అందులో భాగంగా తన రెండో సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది ఈసినిమా.

'గేమ్ ఛేంజర్' సెట్స్‌లో డైరెక్టర్ శంకర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
తమిళ అగ్ర దర్శకుడు ఎస్ శంకర్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఇది ఆయనకు 60వ పుట్టినరోజు కావడం విశేషం. అయితే ఆయన తన పుట్టినరోజును 'గేమ్ ఛేంజర్' మూవీ సెట్స్‌లో జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు చిత్ర నిర్మాత దిల్ రాజు.. డైరెక్టర్ శంకర్‌తో కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ చెప్పారు. వీరితో పాటు 'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ దర్శకుడు శంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో వేసిన సెట్స్‌లో గేమ్ ఛేంజర్ టీమ్ అంతా కలిసి ఎస్ శంకర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో…

గేమ్ చేంజర్ షూటింగ్ అప్డేట్
ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్.ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది అయితే షూటింగ్ విషయంలో మాత్రం నెమ్మదించింది.ఈసినిమాతో పాటు శంకర్,కమల్ హాసన్ తో ఇండియన్ 2కూడా తీస్తుండడంతో గేమ్ చేంజర్ లేట్ అవుతుంది.ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కానుందని సమాచారం.ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా జాయిన్ కానున్నాడు.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చినట్లే.అయితే ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కేవలం సాంగ్స్ కోసం భారీగా ఖర్చుపెడుతున్నాడు నిర్మాత.

గేమ్ ఛేంజర్ హైలెట్ గా 500 మంది ఫైటర్ల క్లైమాక్స్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇక ఎలాంటి బ్రేక్ లు లేకుండా షూట్ ను పూర్తిచేయాలని మేకర్స్ పూర్తి చేయాలని చిత్రయూనిట్…

రామ్ చరణ్ నా సొంత కొడుకు లాంటి వాడు
ఒకవైపు డైరెక్టర్ గా మరోవైపు నటుడిగా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు సముద్రఖని. రీసెంట్ గానే బ్రో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన లో వచ్చిన బ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ చరణ్
ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మరో సారి ప్రేక్షకులను పలకరించనున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది.ఇప్పటివరకు ఈ సినిమానుండి విడుదలైన టీజర్,పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలకానుంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈట్రైలర్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదలచేయనున్నాడు.

చరణ్ తో కలిసి తప్పకుండా సినిమా చేస్తా
ఇప్పుడు మల్టీస్టారర్ లు కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్, చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన తరువాత ఇప్పుడు స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక ఈనేపథ్యంలోనే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో జోష్ ను పెంచుతున్నాయి. అసలు సంగతేంటంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన బెస్ట్ ఫస్ట్ లుక్?
రిలీజ్ కు ముందు ప్రతి సినిమాకు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పుడు ఈ ప్రమోషన్స్ ఒక సినిమా గురించి ప్రేక్షకులు తెలియడానికి ఉపయోగపడేవి. ఇప్పుడు సినిమా మొదలు నుండి రిలీజ్ అయ్యే వరకూ కొత్త కొత్త క్రియేటివిటీతో వస్తున్నారు. సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు. మరోవైపు ప్రమోషన్స్ లో కూడా పోటీ వాతావరణం ఎక్కువైంది. ఎవరికి సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ వస్తే అంత తోపు అన్నట్టుగా తయారైంది. అయితే స్టార్ హీరోలకు మాత్రం ఇవన్నీ మినహాయింపే. ఎంత పోటీ ఉన్నా ఎవరి రికార్డులు వారికే ఉంటాయి. వారి సినిమాల ద్వారా కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంటారు.

గేమ్ ఛేంజర్- హీరో, విలన్ పై కీలక సన్నివేశాలు
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుందన్న సంగతి ఇప్పటికే తెలిసిందే. అంతేకాదు అటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఏదో ఒక సందేశం ఇస్తుంటాడు శంకర్. దీంతోనే ఈసారి రామ్ చరణ్ తో ఎలాంటి సందేశం ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈమధ్య ఒక నెలరోజులపాటు ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అయితే రీసెంట్ గానే మళ్లీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు శంకర్ తెలిపాడు. భారీ ఫైట్ సీక్వెన్స్ తో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు తెలిపాడు.

మెగా ప్రిన్సెస్ కోసం మెగా నర్సరీ
మెగాప్రిన్సెస్ అంటే మాములు గా ఉండదు కదా. తన విషయంలో ప్రతీది ప్రత్యేకంగానే ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహం 2012లో జరిగింది. ఇక ఈవీరి వివాహం జరిగిన 11ఏళ్ల తరువాత ఉపాసన ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ తరుణం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ చరణ్ తండ్రి అవ్వడంతో సంబరాలు జరుపుకున్నారు. మరి తాత మెగాస్టార్ చిరంజీవి, తండ్రి మెగా పవర్ స్టార్, తల్లి అపోలో ఆస్పత్రి వ్యవహరాలకు సంబంధించిన బాధ్యతలు నెరవేర్చుతుంది.. మరి అలాంటి వారసురాలి విషయంలో ఏ చిన్న విషయమైన ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటికే తన పేరును క్లిన్ కారా గా ఫిక్స్ చేసి రీసెంట్ గా ప్రకటించిన సంగతి…

ఫైటింగ్ సీక్వెన్స్ తో గేమ్ ఛేంజర్ షూట్ షురూ
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పార్లల్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో బిజీ అయిపోయాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మెసేజ్ ఒరియెంటెడ్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఇటీవలే ఈసినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

గేమ్ ఛేంజర్- భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూట్ కు రెడీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. అయితే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా సడెన్ గా బ్రేకులు పడ్డాయి. ఉపాసన డెలివరీ కూడా ఉండటంతో చరణ్ కూడా షూట్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇక చాలా గ్యాప్ రావడంతో మళ్లీ సినిమా షూట్ ను…

చరణ్-దీపికా సీక్రెట్ ప్రాజెక్ట్
ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా తమ అభిమాన హీరోలు పలానా హీరోయిన్ తో చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి కాంబినేషన్ లో రామ్ చరణ్-దీపికా పదుకొనేది కూడా ఒకటి. దీపికా పదుకునే ఇప్పటికే ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుంది. ఇక ఆమధ్య మహేష్-దీపికా కాంబినేషన్ లో కూడా ఒక సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అవి వార్తలుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా రామ్ చరణ్-దీపికా పదుకొనే కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇది సినిమా కోసం కాదనుకోండి. అసలు సంగతేంటంటే..

ఆస్కార్ జ్యూరీలో RRR కు పెద్ద పీట
ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా స్థాయి అంతర్జాతీయంగా ఎంత పెరిగిందో చూశాం. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ ఇంకా అల్లూరి సీతారామరాజు జీవితచరిత్ర ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమా గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఇక ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు భారతీయ సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లింది. ఈ చిత్రంలోని నాటు నాటు…

ప్రతి తండ్రిలాగే నేనూ ఫీలయ్యా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన జులై20 వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. దాదాపు 11 ఏళ్ల తరువాత వీరికి సంతానం కలిగింది. వీరి వివాహం 2012లో జరిగిన సంగతి తెలిసిందే కదా. అయితే తమకు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కంటాను అని ఎన్నో సందర్భాల్లో ఉపాసన చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ ఇలాంటి కబురు కోసం ఎదురుచూసుకంటూ వచ్చారు. ఫైనల్ గా గత ఏడాది డిసెంబర్ లో మెగాస్టార్ రామ్ చరణ్,ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నారంటూ ప్రకటిచారు. ఇక రెండు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో అటు కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులందరూ సంబరాలు…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పిన యంగ్ హీరో నిఖిల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా జెన్యూన్ పర్సన్ అని అన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. తన తాజా చిత్రం 'స్పై' ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. చరణ్ యాక్టింగ్ జీనియస్, డ్యాన్సింగ్ జీనియస్, బిజినెస్ మేధావి అని చెప్పాడు. రామ్ చరణ్ నిర్మాతగా 'వీ మెగా పిక్చర్స్' పతాకంపై తీసే తొలి చిత్రంలో తనను హీరోగా ఎంపిక చేసినందుకు చరణ్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో పాత్రలకు ఎవరైతే న్యాయం చేస్తారో.. ఆలోచించి వారినే చరణ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారని భావిస్తున్నానని చెప్పాడు. ఇక ఈ సినిమా కోసం తన సర్వస్వం ఇస్తానని నిఖిల్ అన్నాడు.