లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పార్లల్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో బిజీ అయిపోయాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా మెసేజ్ ఒరియెంటెడ్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఇటీవలే ఈసినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే షూట్ కు బ్రేక్ పడింది. ఉపాసన డెలివరీ కూడా ఉండటంతో రామ్ చరణ్ షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈమధ్యలో పలు వార్తలే తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు శంకర్. గేమ్ ఛేంజర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్లుగా ట్వీట్ చేశాడు. కె.జి.యఫ్ ఫేమ్ ఫైట్ మాస్టర్ అన్బు అరివు నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదుఈ సినిమాకు ఈ సీక్వెన్స్ హైలైట్గా నిలుస్తాయని అంటున్నారు.
Jumping right into a riveting fight sequence. Back in action, truly! #Gamechanger pic.twitter.com/HKpjXeNfbH
— Shankar Shanmugham (@shankarshanmugh) July 11, 2023
కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోనుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: