చరణ్ తో కలిసి తప్పకుండా సినిమా చేస్తా

i will do a film with ram charan says prabhas

ఇప్పుడు మల్టీస్టారర్ లు కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్, చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన తరువాత ఇప్పుడు స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక ఈనేపథ్యంలోనే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో జోష్ ను పెంచుతున్నాయి. అసలు సంగతేంటంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా యూఎస్ఏలో శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ కోసం అక్కడికి వెళ్లారు చిత్రయూనిట్. అక్కడ జరిగిన ఈవెంట్ ఈసినిమా టైటిల్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కల్కి 2898 ఏడీ అనే టైటిల్ ను ఈసినిమా కోసం ఫిక్స్ చేశారు. మరోవైపు ఫస్ట్ గ్లింప్స్ ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతుందో చూస్తున్నాం. కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఒక కొత్త ప్రపంచాన్ని.. కొత్త అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు కలిగించడానికి సిద్దమైనట్టు తెలుస్తుంది. గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారికి తారా స్థాయికి వెళ్లిపోయాయి.

అయితే అక్కడ ఓ మీడియాతో మాడ్లాడిన ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. బ్లూ స్క్రీన్ సన్నివేశాల్లో ఎక్కువగా నటిస్తున్నారు బోర్ కొట్టడంలేదా అన్న ప్రశ్నకు ప్రభాస్ సమాధానంగా.. మొదట బోర్ కొట్టేది.. కానీ ఇప్పుడు గ్లింప్స్ చూశాక చాలా హ్యాపీ గా ఉంది అని తెలిపాడు. ఇంకాా రాజమౌళి, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ..భారత్ లో ఉన్న అద్భుతమైన డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు.. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం చాలా సంతోషకరం.. ఇక రామ్ చరణ్ నాకు మంచి ఫ్రెండ్.. ఏదో ఒకరోజు చరణ్ నేను కలిసి సినిమా చేస్తామంటూ తెలిపాడు. దీంతో ప్రభాస్ కామెంట్స్ పై అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ లో ఉన్నారు. చూద్దాం మరి ఆ తరుణం ఎప్పుడొస్తుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.