ప్రతి తండ్రిలాగే నేనూ ఫీలయ్యా

ram charan emotional speech about his new born baby

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన జులై20 వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. దాదాపు 11 ఏళ్ల తరువాత వీరికి సంతానం కలిగింది. వీరి వివాహం 2012లో జరిగిన సంగతి తెలిసిందే కదా. అయితే తమకు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కంటాను అని ఎన్నో సందర్భాల్లో ఉపాసన చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ ఇలాంటి కబురు కోసం ఎదురుచూసుకంటూ వచ్చారు. ఫైనల్ గా గత ఏడాది డిసెంబర్ లో మెగాస్టార్ రామ్ చరణ్,ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నారంటూ ప్రకటిచారు. ఇక రెండు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో అటు కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకున్నారు. మెగా ప్రిన్సెస్‌ వచ్చిందంటూ సోషల్‌ మీడియాలో ఈవార్త వైరల్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నేడు ఉపాసన ఆస్పత్రినుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈనేపథ్యంలో రామ్ చరణ్, ఉపాసన మీడియా ముందుకు వచ్చారు. ఈసందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.. ఉపాసన, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.. పాపను చూసి ప్రతి తండ్రి తమ బిడ్డను చూసినప్పుడు ఎలా ఫీలవుతాడో నేను కూడా అలానే ఫీలయ్యా.. అభిమానులు మాపై చూపించే ప్రేమ అలాగే వారు చేసే పూజలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కృతజ్ఞతలు మీ ఆశీస్సులు కూడా మా పాపకు ఉండాలి అని అన్నారు. పాప కు పేరు పెట్టే విషయం గురించి చెబుతూ.. పేరు మాత్రం 12వ రోజు లేదా 20వ రోజు ఒక ప్రత్యేకమైన వేడుకలో తెలియచేయవచ్చు. అయితే నేను ఉపాసన ఇప్పటికే ఒక ఒక పేరు అనుకున్నాము. కానీ అందరం డిసైడ్ అయిన తర్వాత ఆ పేరు గురించి తెలియజేస్తాము.. ఆరోజు వస్తే నేనే అందరికీ చెబుతాను అని చరణ్ తెలిపాడు. ఇక పాప ఎవరి పోలిక అనే ప్రశ్నకు రామ్ చరణ్ తన పోలిక అంటూ చాలా సరదాగా సమాధానం ఇచ్చారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =