
ట్యాగ్ · 713 కథనాలు · పేజీ 7


రామ్ చరణ్-నిఖిల్ ప్రాజెక్ట్ లోకి అనుపమ్ ఖేర్

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్‌డేట్

రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం

ఫ్యామిలీతో ముంబైకి రామ్ చరణ్.. ఎందుకంటే..?

జానీ మాస్టర్ కు మెగా బహుమతి

ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

గేమ్ ఛేంజర్- చరణ్ బర్త్ డేకి అప్ డేట్

రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ కన్ఫామ్

గేమ్ ఛేంజర్- 2024 ఫిబ్రవరి కి కంప్లీట్ చేయాలనే ప్లాన్

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లేటెస్ట్ అప్డేట్

నేను చేయాలనుకునే డైెరెక్టర్, హీరో వాళ్లే

అమెరికాలో ఇంకా తగ్గని 'ఆర్ఆర్ఆర్' క్రేజ్

చిరంజీవి, రామ్ చరణ్ గొప్ప మనస్సు
కార్గిల్ వార్ సందర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు, ఉత్తరాఖండ్ వరదలు, కోనసీమ వరదల సమయంలో కానీ, వైజాగ్‌లో హుదూద్ వచ్చినప్పుడు, కోవిడ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు.. ఇలా ఒకటేమిటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలబడుతూ తనదైన స్పందనను తెలియజేసే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

రామ్ చరణ్-నిఖిల్ ప్రాజెక్ట్ లోకి అనుపమ్ ఖేర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొత్త ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, 'యూవీ క్రియేషన్స్'కి చెందిన విక్రమ్ రెడ్డితో కలిసి 'వీ మెగా పిక్చర్స్' అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అయితే ఈ పతాకంపై తీసే తొలి చిత్రంలో యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్నాడు. ఈ క్రమంలో తమ మొదటి ప్రాజెక్ట్‌కి 'ది ఇండియా హౌస్' అనే పేరు కూడా ఇదివరకే ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్
శంకర్- రామ్ చరణ్ కాంబో లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.ఎప్పుడో స్టార్ట్ అయిన ఈసినిమా ఎట్టకేలకు పూర్తవుతుంది.ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ జరుగుతుంది.ఈరోజే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో శ్రీకాంత్,సముద్రఖని పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మూడు రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.దాంతో షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.

రామ్ చరణ్ చేతుల మీదుగా.. రావు రమేష్ మూవీ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో రావు రమేష్ సరసన ఇంద్రజ కథానాయికగా నటించగా.. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు.

రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు ఈ చిత్రంలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన నటన పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటలో సహనటుడు జూ. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు గ్లోబల్ వైడ్‌గా సెన్సేషనే సృష్టించాయి. ఈ పాట ఒరిజినల్ బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది.

ఫిలింఫేర్ అవార్డ్స్.. ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ రేంజ్‌లో పాపులర్ అయ్యారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో తెలుగు గడ్డకు చెందిన స్వాతంత్య్ర సమరవీరులు కొమురం భీముడు పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుత నటనను ప్రదర్శించారు. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాట ఏకంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

ఫ్యామిలీతో ముంబైకి రామ్ చరణ్.. ఎందుకంటే..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురువారం ముంబైలో మెరిశాడు. ఈ మేరకు సతీమణి ఉపాసన, కుమార్తె క్లిన్‌కారాతో కలిసి ముంబై చేరుకున్న ఆయనను స్థానిక మీడియా కెమెరాల్లో బంధించింది. అయితే ఇలా సడెన్‌గా ఫ్యామిలీతో కలిసి చరణ్ ముంబై వెళ్ళడానికి కారణం ఏంటంటే..? అంబానీల ఇంట వివాహ వేడుకలో పాల్గొనేందుకు వారు ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతకుముందు రామ్ చరణ్ ముంబై బయలుదేరుతున్న విజువల్స్ ట్రెండింగ్‍లో నిలిచాయి.

జానీ మాస్టర్ కు మెగా బహుమతి
తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయిన జానీ మాస్టర్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇక్కడ చిరంజీవి సహా ఎంతో మంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన జానీ మాస్టర్ ఇక్కడ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా బిజీ అయిపోయారు. ఎంతోమంది హీరోలకు కొరియోగ్రఫి చేస్తున్నారు.

రోజు రోజుకీ మా నాన్న వయస్సు తగ్గుతోంది - రామ్ చరణ్
రోజు రోజుకీ మా నాన్న వయస్సు తగ్గుతోందని, ఆయన ఇంకా యంగ్‌గా మారుతున్నారని పేర్కొన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు ఆయన తాజాగా ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆయనతో తనకున్న అనుబంధం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి తనయుడిగా జన్మించడం తన అదృష్టమన్న ఆయన చిత్ర పరిశ్రమలో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పారు.

ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ లో ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. పెద్ద సినిమా అని లేదు చిన్న సినిమా అని లేదు హిట్ అయిన సినిమాలను మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమా కూడా రీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డ్ ను సైతం అందించిన సినిమా ఆర్ఆర్ఆర్.

గేమ్ ఛేంజర్- చరణ్ బర్త్ డేకి అప్ డేట్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ కన్ఫామ్
ఒకనాటి అందాలతార శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ఎన్నో ఏళ్లు ఏలారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి చనిపోయిన తరువాత ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆ కోరిక కూడా తీరిపోనుంది. ఇప్పటికే జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోనుండగా ఈఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

గేమ్ ఛేంజర్- 2024 ఫిబ్రవరి కి కంప్లీట్ చేయాలనే ప్లాన్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈసినిమా షూటింగ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రామ్ చరణ్.

ముంబై పర్యటనలో రామ్ చరణ్.. ధోనితో ఫోటో, నెట్టింట వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంగళవారం ముంబైలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలుచోట్ల సందడి చేశారు. నగరంలోని ప్రముఖ సిద్ది వినాయకుడి ఆలయాన్ని సందర్శించారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న రామ్ చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి ఏటా చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుంటాడన్న విషయం తెలిసిందే కదా. అయితే రామ్ చరణ్ అయ్యప్ప దీక్షను సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక రాజకీయ నేత రాహుల్ నారాయణ్‌తో చరణ్ ఈ ఆలయానికి వెళ్లారు. రామ్ చరణ్ సిద్ది వినాయక ఆలయాన్ని సందర్శించిన ఫొటోలను రాహుల్ నారాయణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఈ…

రామ్‌చరణ్ కొత్త ఫ్రెండ్ ని చూశారా..? నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో
టాలీవుడ్ ప్రముఖ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్రెండ్స్ లిస్టులోకి మరొకరు వచ్చి చేరారు. ఈ మేరకు ఆయన స్వయంగా తన కొత్త స్నేహితుడిని పరిచయం చేశారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా తన ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ఆయన ఫ్యాన్స్ స్పందిస్తుండటంతో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. రామ్ చరణ్ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రెండ్ మరెవరో కాదు.. ఆయన ఫామ్ హౌస్ లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక గుర్రం. అవును మీరు వింటున్నది నిజమే.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లేటెస్ట్ అప్‌డేట్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గేమ్ ఛేంజర్'. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. 'వినయ విధేయ రామ' తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా కావడం గమనార్హం. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి ఇతర ప్రధాన…

నేను చేయాలనుకునే డైెరెక్టర్, హీరో వాళ్లే
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో, సినిమాలతో బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించింది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతుంది. ప్రస్తుతం కంగనా నుండి రాబోతున్న సినిమా చంద్రముఖి 2. పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా ఈసినిమా వస్తుంది.

అమెరికాలో ఇంకా తగ్గని 'ఆర్ఆర్ఆర్' క్రేజ్
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే. దేశీయంగానే కాకుండా విదేశాల్లో సైతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, హెచ్‌సీఏ అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్, 46వ ‘జపాన్ అకాడమీ అవార్డు, 69వ ఇండియన్ నేషనల్ అవార్డ్ సహా మరికొన్నింటిని ‘ఆర్ఆర్ఆర్’ దక్కించుకుంది.

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు.. హాజరైన రాజమౌళి, రామ్ చరణ్, బ్రహ్మానందం తదితరులు
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరై అక్కినేనికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఆర్‌సీ16 కోసం కొత్త ఆఫీస్ ప్రారంభించిన మూవీ టీమ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ 'ఆర్‌సీ16'గా పరిగణిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు 'ఆర్‌సీ16'కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని బీఎన్‌ఆర్ హిల్స్‌లో ప్రత్యేకంగా ఒక కొత్త ఆఫీస్‌ని…