
ట్యాగ్ · 713 కథనాలు · పేజీ 26


'RC 15' షూటింగ్ మొదలు

సినిమా , నటన అంటే ప్రాణం- పూజాహెగ్డే

పక్కా ప్లాన్ తో 'RC 15' షూటింగ్..!

25 భాషలలో చిరంజీవి వెబ్ సైట్

"#RC16" మూవీ అనౌన్స్ మెంట్

ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ మూవీ..!

హిందీ భాషలో భారీగా "ఆచార్య "రిలీజ్

'ఆచార్య' పూజా లుక్ రిలీజ్

'ఆర్ఆర్ఆర్'.. ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ..!

"ఆచార్య" మూవీ రిలీజ్ డేట్

"RRR" మూవీ కి ఎన్టీఆర్ , రామ్ చరణ్ డబ్బింగ్ పూర్తి

'RC15' కోసం బల్క్ డేట్స్

పుణె లో "#RC15"మూవీ యాక్షన్ సీన్స్

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ ఫిక్స్

కిస్మస్ బరిలో 'ఆచార్య'..!

రామ్ చరణ్ 14 ఇయర్స్ సినీ జర్నీ

రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్

'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్ చేయనున్న చరణ్

"#RC 15 " మూవీలో మెగా యాక్షన్ ఎపిసోడ్

భారీ సాంగ్ చిత్రీకరణలో "#RC15"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.

'RC 15' షూటింగ్ మొదలు
శంకర్-చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు. అయితే రామ్ చరణ్ ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉండటం వల్ల సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఈగ్యాప్ లో శంకర్ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు కానిచ్చేశాడు. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ ను ఈనెలలో స్టార్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈసినిమా షూటింగ్ పూణెేలో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో చరణ్, కియారా అద్వానీ పై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.

సినిమా , నటన అంటే ప్రాణం- పూజాహెగ్డే
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే వరుస అవకాశాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలీవుడ్ లో "సర్కస్ ","భాయిజాన్ ", కోలీవుడ్ లో "బీస్ట్ " మూవీ లో నటిస్తున్నారు. "#SSMB 28 " మూవీ లో పూజా కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ దసరా కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.ప్రస్థుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా సక్సెస్ ను పూజాహెగ్డే ఎంజాయ్ చేస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

పక్కా ప్లాన్ తో 'RC 15' షూటింగ్..!
శంకర్-చరణ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాకోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో ఉండటంతో శంకర్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ను పక్కా ప్లాన్ తో శంకర్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ను పూణెలో స్టార్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనికోసం అక్కడ ఒక భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ షెడ్యూల్ ను…

25 భాషలలో చిరంజీవి వెబ్ సైట్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సేవాకార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గర చేయడానికి www.chiranjeevicharitabletrust.com పేరుతో వెబ్‌సైట్‌ను , చిరంజీవి రీల్ , రియల్ లైఫ్ విశేషాలతో కూడిన www.kchirangeevi.com ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘20ఏళ్లకు పైగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ , సేవా కార్యకమ్రాలను మరిన్ని ప్రాంతాల్లో ప్రజలకు అందించేందుకు పాతిక భాషల్లో వెబ్‌సైట్‌ను ప్రారంభించామనీ , ఆక్సిజన్, రక్తం అవసరమైన వారు, రక్తదానం, నేత్రదానం చేయాలనుకున్నవారు ఈ వెబ్‌సైట్ ద్వారా సంప్రతించవచ్చుననీ , అలాగే…

"#RC16" మూవీ అనౌన్స్ మెంట్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం" మూవీ 2002 జనవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “#RC15” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.

ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ మూవీ..!
మెగా పవర్ స్టార్ చరణ్ కూడా స్పీడ్ పెంచాడు. గత మూడేళ్లుగా ఒకే సినిమాకు కమిట్ అయిన చరణ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక త్వరలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 15వ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నాడు.

హిందీ భాషలో భారీగా "ఆచార్య "రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఫిబ్రవరి 4, 2022న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'ఆచార్య' పూజా లుక్ రిలీజ్
ముకుందా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూజాహెగ్డే కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బందులే ఎదుర్కొంది. ప్రారంభంలో చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో పలు కామెంట్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత అపజయాలను కూడా పట్టించుకోకుండా కెరీర్ లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండియాలోనే బిజీ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమా చేస్తూనే మరోపక్క హిందీ, తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

'ఆర్ఆర్ఆర్'.. ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ..!
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్టే ఈసినిమా రిలీజ్ కూడా వెనక్కి వెళుతుంది. ఎన్నోరోజుల సస్పెన్స్ తర్వాత రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ అవుతుందని అంటున్నారు బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ. ఈసినిమా ట్రైలర్ ఫైనల్ కట్…

"ఆచార్య" మూవీ రిలీజ్ డేట్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

"RRR" మూవీ కి ఎన్టీఆర్ , రామ్ చరణ్ డబ్బింగ్ పూర్తి
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ జనవరి 7 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , కొమురం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ కథానాయికలు . అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

'RC15' కోసం బల్క్ డేట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను ఇటీవలే లాంఛనంగా ప్రారంభించగా ఇప్పుడు షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇక మొదటి షెడ్యూల్ ను పూణె లో మొదలుపెట్టనున్నారట. దీనికోసం ఇప్పటికే అక్కడ భారీ సెట్ కూడా వేసినట్టు తెలుస్తుంది. సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ లోనే చరణ్ మరియు కియారాల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. మొదటి షెడ్యూల్ ను దాదాపుగా నెల రోజుల పాటు నిర్వహిస్తారట.

పుణె లో "#RC15"మూవీ యాక్షన్ సీన్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ ఫిక్స్
ఫైనల్లీ దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ పై ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చింది. పరిస్థితులు అన్నీ బావుంటే ఇప్పటికే సినిమా రిలీజ్ అయి ఉండేది. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ సినిమా షూటింగ్ కూడా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది కూడా పోస్ట్ పోన్ అయింది. అయితే గత కొద్ది రోజులుగా మళ్లీ ఈసినిమా రిలిజ్ డేట్ పై వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఈసినిమా రిలీజ్ అవుతుందో లేదో అని.. సమ్మర్ లో రిలీజ్ అవుతుందేమో అన్న వార్తలు మొదలయ్యాయి. ఇక ఈ కన్ఫ్యూజన్ లో ఉండగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. వచ్చే ఏడాది…

కిస్మస్ బరిలో 'ఆచార్య'..!
పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ల విషయంలో ఇప్పటికే చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. ఏదో ఒకటి రెండు సినిమాల విషయంలో కాస్త ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా.. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ డేట్లను సైతం ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఇంకా రిలీజ్ విషయంలో క్లారిటీ రాని సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడకుండా ఉంటే ఆగష్ట్ లో ఈసినిమా రిలీజ్ అయి ఉండేది. అయితే అది కుదరలేదు. దీంతో దసరాకు అయినా ఈసినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో దసరా కు కూడా ఈసినిమా రిలీజ్ కాలేకపోతుంది. ఇక ఫైనల్ గా సంక్రాంతికే ఈసినిమాను…

రామ్ చరణ్ 14 ఇయర్స్ సినీ జర్నీ
మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "చిరుత" మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "చిరుత "(2007 ) మూవీ లో రామ్ చరణ్ అద్భుతమైన డ్యాన్స్ , ఫైట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో రామ్ చరణ్ రెండవ మూవీ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ "మగధీర"ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1000 రోజులు ప్రదర్శించబడింది ఈ మూవీ 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాజ్ తరుణ్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత చాలా సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు విజయాలు అందించినా చాలా సినిమాలు పరాజయాన్నే అందించాయి. ఇక గత కొంతకాలంగా సరైన హిట్ లేని రాజ్ తరుణ్ ఈ సారి ఎలాగైన మంచి సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఈసారి డిఫరెంట్ కథలతో వస్తున్నాడు. అందులో ఒకటి అనుభవించు రాజా సినిమా ఒకటి.

'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్ చేయనున్న చరణ్
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు "మూవీ ఫేమ్ శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తుండగా మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈసినిమా నుండి రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

"#RC 15 " మూవీలో మెగా యాక్షన్ ఎపిసోడ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం. ”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.