‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాజ్ తరుణ్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత చాలా సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు విజయాలు అందించినా చాలా సినిమాలు పరాజయాన్నే అందించాయి. ఇక గత కొంతకాలంగా సరైన హిట్ లేని రాజ్ తరుణ్ ఈ సారి ఎలాగైన మంచి సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఈసారి డిఫరెంట్ కథలతో వస్తున్నాడు. అందులో ఒకటి అనుభవించు రాజా సినిమా ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో రాజ్‌తరుణ్‌తో కలిసి ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీను గవిరెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమా నుండి రాజ్ తరణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ట్వీట్టర్ వేదికగా ఈటీజర్ ను రిలీజ్ చేస్తూ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఇక టీజర్ ను అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది. ‘బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉండగా ఇంకోకడు గెలవడం కష్టమే’అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
Here’s the fun-filled teaser of #AnubhavinchuRaja
Good luck to the entire team !#AnubhavinchuRajaTeaserhttps://t.co/2Jt8V3qinw@AnnapurnaStdios @SVCLLP @itsRajTarun @GavireddySreenu @adityamusic @GopiSundarOffl pic.twitter.com/x7t1AsZFua— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2021
ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మోడల్ కాషిశ్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకునే పనిలో ఉంది. త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: