సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు “మూవీ ఫేమ్ శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తుండగా మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈసినిమా నుండి రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మోడల్ కాషిశ్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
దీంతోపాటు మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ‘స్టాండప్ రాహుల్’ లో చేస్తున్నాడు. ఈసినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: