శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RC15” మూవీ షూటింగ్ పుణె లో జరుగుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై దర్శకుడు శంకర్ ఒక భారీ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సాంగ్ ఇప్పటివరకూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెరకెక్కని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 12 రోజుల పాటు ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. దర్శకుడు శంకర్ , హీరో రామ్ చరణ్ ఫస్ట్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “#RC15” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































