
ట్యాగ్ · 68 కథనాలు · పేజీ 3


వెబ్ సిరీస్ లో ట్విన్స్ గా రకుల్ ?
ఢిల్లీ టు హైదరాబాద్
రకుల్ ప్రీత్ వేగనిజం ప్రమోషన్
నా జీవితంలో '3 ఎఫ్' లు..!
రకుల్ ప్రీత్ హ్యాపీ ఫీలింగ్స్
రకుల్ ప్రీత్ షూటింగ్ కు రెడీ

1993 నుండే అలవాటు ఉంది..!
ఆనందం లో రకుల్ ప్రీత్ సింగ్

లాక్ డౌన్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్న రకుల్..!
జాగింగ్ లో రకుల్ ప్రీత్
రకుల్ పాత జ్ఞాపకాలు

14 మిలియన్ ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్

రకుల్ ప్రీత్ ప్లాన్స్ తారుమారు

మెడికల్ షాపుల్లో కూడా మద్యం అమ్ముతారా...!
రకుల్ ప్రీత్ కరోనా చిట్కాలు

రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్
రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఐడియా

కరోనా పై పోరాడుదాం - రకుల్ ప్రీత్ సింగ్
ప్రపంచంలోని ప్రజలందరి పైన కరోనా మహమ్మారి తన ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ప్రజల జీవన సరళి లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ ముగిసినా ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక చిత్ర పరిశ్రమకు వస్తే పలు రకాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీస్ 4 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. షూటింగ్స్ కి అనుమతులు వచ్చినా పూర్తి స్థాయిలో షూటింగ్స్ జరగడం లేదు. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

వెబ్ సిరీస్ లో ట్విన్స్ గా రకుల్ ?
ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వెబ్ సిరీస్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా థియేటర్స్ మూతపడడంతో వెబ్ సిరీస్ నిర్మాణం ఊపు అందుకుంది. నిర్మాతలు , దర్శకులు డిజిటల్ మీడియా పై దృష్టి సారించారు. వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండడంతో స్టార్ హీరోయిన్స్ సమంత , కాజల్ అగర్వాల్ , తమన్నా , త్రిష , అంజలి వంటి వారు వెబ్ సిరీస్ లకు సై అంటున్నారు.
ఢిల్లీ టు హైదరాబాద్
పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. రకుల్ నటించిన "దే దే ప్యార్ దే ", "మర్జావాన్ " హిందీ మూవీస్ ఘనవిజయం సాధించడంతో హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ ప్రస్తుతం "ఎటాక్ ", "ఛలే ఛలో " హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. తమిళ భాషలో "ఇండియన్ 2", అయిలాన్ ", తెలుగు లో నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు.
'ఇండియన్ 2' పై రకుల్ - అలాంటి వారు ఉంటే ఎంతో నేర్చుకోవచ్చు..!
ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా పలు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది తెలుగులో మన్మధుడు2, హిందీలో 'దే దే ప్యార్ దే' సినిమా తో సందడి చేయగా.. ఈ ఏడాది ఒక అరడజను సినిమాలను లైన్ లో పెట్టింది. అందులో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి.
రకుల్ ప్రీత్ వేగనిజం ప్రమోషన్
తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను ఆలరిస్తూ రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రీత్ కొన్ని నెలల క్రితం శాకాహారి (వేగన్ ) గా మారిన విషయం తెలిసిందే. వరల్డ్ ఎన్విరాన్ మెంట్ రోజున "PETA " సంస్థతో చేతులు కలిపి వేగనిజం ను రకుల్ ప్రమోట్ చేస్తున్నారు. శాకాహారం వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. బరువు నియంత్రణ , కిడ్నీ ఫంక్షనింగ్ , కొన్ని రకాల కేన్సర్స్ ను అడ్డుకొనడం , హార్ట్ డిసీజెస్ ను దూరం చేయడం, ఆర్థరైటిస్ నొప్పులు తగ్గించడం వంటి ఉపయోగాలు ఉన్నాయి.
నా జీవితంలో '3 ఎఫ్' లు..!
తన జీవితం మూడు ఎఫ్ లతో ముడిపడి ఉందని చెపుతుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన సినీ రంగ ప్రవేశం గురించి... తనకు ఎలాంటి అబ్బాయి కోసం చూస్తుందో ఇలా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఒక మనిషిగా నేను కూడా మారుతుంటాను.. నా దృష్టిలో ప్రేమ అంటే అర్ధం నేను మా పేరెంట్స్ లో చూసేదే.. ప్రేమ, పెళ్లి పై నాకు పూర్తి నమ్మకం వుంది.. కొంతం మంది వాటి వల్ల ప్రెషర్ అంటారు అర్ధంకాదు.. నాకు తెలిసి ప్రేమ, పెళ్లి అనేవి చాలా గొప్పగా వుంటాయని అనుకుంటున్నాను.. నావరకునేనైతే ఎవరినైనా ప్రేమిస్తే హార్ట్ ఫుల్ గా ప్రేమిస్తా అని చెప్పుకొచ్చింది. అంతే కాదు తనకంటే పొడవు.. తను హీల్స్ వేసుకున్నా సరే…
రకుల్ ప్రీత్ హ్యాపీ ఫీలింగ్స్
"కెరటం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ హోదా ను అందుకున్నారు. రకుల్ నటించిన "దే దే ప్యార్ దే ", "మర్జావాన్" హిందీ మూవీస్ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో బిజీగా మారారు. రకుల్ ప్రస్తుతం 2హిందీ , 2 తమిళ , ఒక తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అయిన రకుల్ షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ముంబై లో త్వరలోనే ప్రారంభం కానున్న హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.
రకుల్ ప్రీత్ షూటింగ్ కు రెడీ
తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ , తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి ఇంటికే పరిమితం అయిన రకుల్ ఫుడ్ , వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో ఎదురు చూస్తున్న రకుల్ ఒక హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.
రూమర్స్ పై ఫన్నీ కౌంటర్ .. పనిలేక చచ్చిపోతున్నా చెప్పండి..!
సోషల్ మీడియాలో హీరో హీరోయిన్స్ పై పలు గాసిప్స్ రావడం కామన్ థింగే. కొంతమంది వాటిని పట్టించుకుంటే కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు. అయితే ఇక్కడ రకుల్ మాత్రం తనపై వచ్చిన తప్పుడు కథనాలపై కామెడీగా స్పందిస్తూనే.. కౌంటర్ యిచ్చేసింది. నిజానికి రకుల్ కి ఇదేం కొత్త కాదు. ఇప్పటికే తనపై నెగిటివ్ కామెంట్ చేసినోళ్లకి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. ఇక తాజాగా తనపై వచ్చిన రూమర్ ఏంటంటే..

1993 నుండే అలవాటు ఉంది..!
లాక్‌డౌన్‌లో సినిమా షూటింగ్స్ కూడా ఏం లేకపోవడంతో రకుల్ తన కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు తన బ్రదర్ తో ఆడే ఆటలు.. వంటలు చేసిన వీడియోలు, సినిమాలు చూస్తూ, ముఖ్యంగా వర్క్ ఔట్స్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక రకుల్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు స్వంత ఫిట్ నెస్ సెంటర్లు కూడా వున్నాయంటేనే అర్థంచేసుకోవచ్చు ఫిట్ నెస్ పై ఎంత శ్రద్దనో. ఇక తాజాగా తన ఇన్‌స్ట్రామ్ అకౌంట్‌లో ఒక ఫొటోను షేర్ చేసింది. అయితే ఇది ఇప్పటి ఫొటో కాదు. ఆమె చిన్నప్పటి ఫోటో. ఆ ఫొటోలో రకుల్ యోగ చేస్తుంది. ఆ ఫొటోను షేర్ చేస్తూ 1993 నుండే అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక…
ఆనందం లో రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు , తమిళ , హిందీ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కరోనా లాక్ డౌన్ సమయంలో ముంబై లో ఇంటికి పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు. దాదాపు 3నెలల తరువాత గురుగావ్ లోని తన స్వంత ఇంటికి రకుల్ చేరుకున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులతో టైమ్ స్పెండ్ చేస్తున్న రకుల్ ఆనందం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

లాక్ డౌన్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్న రకుల్..!
లాక్ డౌన్ లో దొరికిన సమయాన్ని హీరో హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఉపయోగించుకుంటున్నారు. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూనే మరో పక్క తమ వీడియో లతో అభిమానులకు దగ్గరగానే వుంటున్నారు. హీరోలు దాదాపు వర్క్ అవుట్ లు చేస్తూ టైమ్ ను స్పెండ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ అయితే కిచెన్ లో ప్రయాగాలు కూడా చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు చాలా మంది హీరోయిన్స్ వివిధ అంశాలకు సంబంధించి ఆన్ లైన్ లో క్లాసెస్ కు కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు రకుల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఈ లాక్‌డౌన్ సమయంలో చేసిన తన ఫిట్ నెస్ కు…
జాగింగ్ లో రకుల్ ప్రీత్
కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ సమయంలో రెండున్నర నెలలుగా ఇంటికే పరిమితం అయిన సినీ సెలబ్రిటీస్ లాక్ డౌన్ సమయం కంప్లీట్ అయ్యి అన్ లాక్ 1. 0 తో ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. పలువురు సెలబ్రిటీస్ ముంబై రోడ్స్ పై వాకింగ్ , జాగింగ్ చేస్తున్నారు. ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే రకుల్ ముంబై లోని బాంద్రా లో జాగింగ్ చేస్తూ కనపడ్డారు.
రకుల్ పాత జ్ఞాపకాలు
తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ నటించిన రొమాంటిక్ యాక్షన్ మూవీ "మర్జావాన్ " ఘనవిజయంతో బాలీవుడ్ లో బిజీగా మారారు. అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న మూవీ , జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "అటాక్ " మూవీలో నటిస్తున్నారు.

14 మిలియన్ ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న రకుల్ వర్క్ అవుట్స్, ఫోటో షూట్స్ , ఫుడ్ , మూవీ విశేషాలు వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. కరోనా కారణం గా లాక్ డౌన్ బాధితులకు తన వంతు సాయం అందించిన రకుల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పి ఎమ్ కేర్స్ ఫండ్ కు డైవర్ట్ చేస్తున్నారు.

రకుల్ ప్రీత్ ప్లాన్స్ తారుమారు
కరోనా మహమ్మారి కారణం గా మూవీ షూటింగ్స్ , రిలీజ్ లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఇంటికే పరిమితం అయ్యారు . తెలుగు, తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ టైమ్ పాస్ చేసిన రకుల్ రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితం అయ్యి బోర్ ఫీల్ అవుతున్నారు.

మెడికల్ షాపుల్లో కూడా మద్యం అమ్ముతారా...!
సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై అప్పుడప్పుడు కామెంట్లు రావడం చూస్తూనే ఉంటాం. వాటికి వాళ్ళు కూడా అప్పుడప్పుడు రివర్స్ కౌంటర్ లు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనపై వచ్చిన కామెంట్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ దుకాణం నుంచి చేతిలో కొన్ని సీసాలు, కొన్ని ప్యాకెట్లతో వస్తూ అందులో ఆమె కనిపిస్తుంది. ఇక దీనిపై కమాల్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ, లాక్ డౌన్ సందర్భంగా రకుల్ ప్రీత్ ఏం కొనుగోలు చేసింది? మద్యం ఏమైనా కొనుగోలు చేసిందా? అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనికి రకుల్ ప్రీత్ ఆసక్తికరంగా స్పందించింది. 'అయ్యో…
రకుల్ ప్రీత్ కరోనా చిట్కాలు
కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రాణాంతక కరోనా వ్యాప్తి నివారణకు స్వీయ గృహ నిర్బంధం తోపాటు వ్యాధి నిరోధక శక్తి ని కూడా బలోపేతం చేసుకొనడం ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నటించిన "దే దే ప్యార్ దే ", "మర్జావాన్" హిందీ మూవీస్ విజయం సాధించడంతో రకుల్ హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. ఫిట్ నెస్ బిజినెస్ లో భాగంగా రకుల్ హైదరాబాద్ లో F 45 జిమ్ ను ప్రారంభించారు.
రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఐడియా
ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం కష్టాలపాలయింది. దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్న విషయం తెలిసిందే. ప్రజలకు తమవంతు సాయంగా సినీ సెలబ్రిటీస్ PM, CM సహాయ నిధులకు విరాళాలు అం దిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంటి సభ్యులతో కలసి తమ ఇంటి సమీపంలో ఉన్న స్లమ్ఏరియాలో 250 కుటుంబాలకు ఆహరం అందిస్తున్నారు. రకుల్ ఇప్పుడు PM కేర్స్ ఫండ్ కై ఒక కొత్త ఐడియా ప్లాన్ చేశారు.