‘ఇండియన్ 2’ పై రకుల్ – అలాంటి వారు ఉంటే ఎంతో నేర్చుకోవచ్చు..!

Tollywood Actress Rakul Preet Singh Is All Praises For Kamal Haasan and Director Shankar

ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా పలు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది తెలుగులో మన్మధుడు2, హిందీలో ‘దే దే ప్యార్ దే’ సినిమా తో సందడి చేయగా.. ఈ ఏడాది ఒక అరడజను సినిమాలను లైన్ లో పెట్టింది. అందులో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఇండియా2 గురించి.. వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శంకర్ లాంటి డైరెక్టర్ తో, కమల్ లాంటి లెజెండరీ నటుడు కమల్ తో నటించాలని సౌత్ లో ప్రతి ఒక్కరూ అనుకుంటారు.. మీకు ఆ అవకాశం దక్కింది ఎలా ఫీల్ అవుతున్నారు అని అడుగగా… దానికి స్పందించిన రకుల్ వారిలాంటి లెజెండ్స్ తో పని చేయడం గొప్ప అనుభూతి.. చాలా తొందరగా నాకు వారితో పని చేసే అవకాశం దక్కింది.. వారు సెట్ లో వుండే విధానం… సీన్ చేసేప్పుడు ట్రీట్ చేసే విధానం గొప్పగా ఉంటుంది.. మన చుట్టూ అలాంటి మంచి వారు ఉంటే నేర్చుకోడానికి ఎంతో ఉంటుంది అన్నారు.

[subscribe]

ఇక లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తుంది. ఇక ఈ ఖాళీ టైం లో పలు రకాల వంటలు వర్కౌట్స్, ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. వీటితోపాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించడానికి ఈ భామ ఇంట్రెస్ట్ చూపుతుంది.

కాగా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్ధ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =