లాక్డౌన్లో సినిమా షూటింగ్స్ కూడా ఏం లేకపోవడంతో రకుల్ తన కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు తన బ్రదర్ తో ఆడే ఆటలు.. వంటలు చేసిన వీడియోలు, సినిమాలు చూస్తూ, ముఖ్యంగా వర్క్ ఔట్స్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక రకుల్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు స్వంత ఫిట్ నెస్ సెంటర్లు కూడా వున్నాయంటేనే అర్థంచేసుకోవచ్చు ఫిట్ నెస్ పై ఎంత శ్రద్దనో. ఇక తాజాగా తన ఇన్‌స్ట్రామ్ అకౌంట్లో ఒక ఫొటోను షేర్ చేసింది. అయితే ఇది ఇప్పటి ఫొటో కాదు. ఆమె చిన్నప్పటి ఫోటో. ఆ ఫొటోలో రకుల్ యోగ చేస్తుంది. ఆ ఫొటోను షేర్ చేస్తూ 1993 నుండే అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ ఫోటోను చూస్తుంటే రకుల్‌కు యోగాపై చిన్ననాటి నుంచి ఎంత ఆసక్తి ఉందనే విషయం అర్థమవుతోంది. మరి ఇప్పుడు హీరోయిన్ అయిన తర్వాత ఆ మాత్రం ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ జోరు ఈ మధ్యన కాస్త తగ్గింది. తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. వీటితోపాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించడానికి ఈ భామ ఇంట్రెస్ట్ చూపుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: