
ట్యాగ్ · 233 కథనాలు · పేజీ 6


'రాధేశ్యామ్' కోసం రంగంలోకి దిగిన థమన్

"రాధేశ్యామ్" ట్రైలర్ కు అద్భుత స్పందన

'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్

'రాధేశ్యామ్'.. పరమహంసగా రెబల్ స్టార్

'రాధేశ్యామ్'.. ఫ్యాన్స్ తో ట్రైలర్ లాంచ్

'ప్రాజెక్ట్ K' పై దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆదిపురుష్ టీమ్ కు ప్రభాస్ స్పెషల్ 'గిఫ్ట్స్'

'రాధేశ్యామ్'.. సంచారి సాంగ్ టీజర్ రిలీజ్

'ప్రాజెక్ట్ K' లో జాయిన్ ప్రభాస్-దీపికా

సౌత్ ఏషియన్ సెలబ్రిటీ నెం1

శృతి హాసన్ "సలార్ "మూవీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

హైదరాబాద్ లో "ప్రాజెక్ట్ K "

'రాధేశ్యామ్' హిందీ సెకండ్ సాంగ్ టీజర్ రిలీజ్

"రాధేశ్యామ్" డబ్బింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే

'ప్రభాస్' రాకపై 'పుష్ప' టీమ్ క్లారిటీ..!

'రాధేశ్యామ్' బ్లాక్ బస్టర్.. ఇది ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కూడా సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులను నమోదు చేశాయి. దీనితోపాటు రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. లవ్ స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్, డ్రామా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ట్రైలర్‌లో ఉన్నాయి. దీనితో సినిమాపై మరంత అంచనాలు పెరిగాయి.

'రాధేశ్యామ్' కోసం రంగంలోకి దిగిన థమన్
రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న ప్రేమకథ రాధేశ్యామ్. ఇక సంక్రాంతి పండుగ సందర్బంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతుందో చూస్తున్నాం.

"రాధేశ్యామ్" ట్రైలర్ కు అద్భుత స్పందన
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం…

'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్
బాహుబలి, సాహో లాంటి సినిమాల తరువాత ప్రభాస్ నుండి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఈసినిమాతో మరోసారి లవర్ బాయ్ లా మారిపోయాడు ప్రభాస్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ అనేక కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'రాధేశ్యామ్'.. పరమహంసగా రెబల్ స్టార్
ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. ఈసినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు భారీగానే ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతుండగా.. అదే రోజు ఫ్యాన్స్ తో ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు.

'రాధేశ్యామ్'.. ఫ్యాన్స్ తో ట్రైలర్ లాంచ్
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. డిసెంబర్ 23న రాధేశ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేశారు. అంతేకాదు అదే రోజున ట్రైలర్ రిలీజ్ ను ఫిక్స్ చేశారు. అయితే ట్రైలర్ ను ఏ సెలబ్రిటీ చేతనో రిలీజ్ చేయించడంలేదు.. ఆ అవకాశాన్ని…

రాధేశ్యామ్.. 'సంచారి' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈసినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్బంగా రిలీజ్ కానుంది. ఇకవింటేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా నుండి చలో చలో సంచారి అనే పాట టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఆలపించిన ఈపాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించాడు. ఈపాటలో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈపాట కూడా మంచి రెస్పాన్స్ తో వ్యూస్ తో దూసుకుపోతుంది.

'ప్రాజెక్ట్ K' పై దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న ప్రభాస్ ఈసినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ తో అలరించడానికి రెడీ అయిపోయాడు. అంతేకాదు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మధ్యే ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ షెడ్యుల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మించగా.. గత కొద్దిరోజులుగా అక్కడే షూటింగ్ ను జరిపారు. ప్రస్తుతం ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ అయితే పూర్తయింది…

ఆదిపురుష్ టీమ్ కు ప్రభాస్ స్పెషల్ 'గిఫ్ట్స్'
సినిమా పూర్తయిన తరువాత కానీ.. సినిమా మంచి సక్సెస్ అయిన తరువాత కానీ హీరో హీరోయిన్స్ చిత్రయూనిట్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇప్పుడు చూస్తునే ఉన్నాం. అప్పట్లో ఇలాంటివి ఎక్కువ చూసేవాళ్లం.. కానీ ఈమధ్య హీరో హీరోయిన్స్ కూడా అది మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా తన చిత్రయూనిట్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

'రాధేశ్యామ్'.. సంచారి సాంగ్ టీజర్ రిలీజ్
రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండగా ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ప్రభాస్ టీజర్ యూట్యూబ్‌లో నయా రికార్డ్స్ సృష్టించాయి. ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఈసినిమా నుండి పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి సంచారి పాట టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో 'సంచారి చలో చలో' అంటూ సాగే ఈ పాట హిందీలో 'ఉడ్…

'ప్రాజెక్ట్ K' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్- దీపికాకు ప్రభాస్ ఫుడ్ ట్రీట్..!
‘మహానటి’ సినిమాతో సావిత్రి గారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ k’ చేయబోతున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఇటీవలే ప్రారంభించగా ముందు అమితాబ్ తో ఉన్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ తర్వాత మిగిలిన నటీనటులతో షూటింగ్ ను చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీఫిలిం సిటిలో జరుగుతుండగా రీసెంట్ గానే ప్రభాస్-దీపికా కూడా ఈసినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది.

'ప్రాజెక్ట్ K' లో జాయిన్ ప్రభాస్-దీపికా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, నాగ్ ఆశ్విన్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈసినిమాల్లో రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక మిగిలిన సలార్, ఆదిపురుష్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కె సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. నిజానికి ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టేశారు. అయితే ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమాలోని మిగిలిన వారితో షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ షూటింగ్ పూర్తయింది కూడా. దీపికా కూడా ఇప్పటికే…

సౌత్ ఏషియన్ సెలబ్రిటీ నెం1
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “రాధేశ్యామ్ ” మూవీ 2022 జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.” ఆదిపురుష్”మూవీ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “సలార్ ” మూవీ సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్ లో జరుగుతున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో "స్పిరిట్ " మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

శృతి హాసన్ "సలార్ "మూవీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న "#NBK107" మూవీ కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

'రాధేశ్యామ్' సోచ్ లియా ఫుల్ సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల అన్ని సినిమాల్లాగే ఈసినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.

హైదరాబాద్ లో "ప్రాజెక్ట్ K "
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.

'రాధేశ్యామ్' హిందీ సెకండ్ సాంగ్ టీజర్ రిలీజ్
అప్పట్లో అయితే రాధేశ్యామ్ నుండి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండేవారు. ఇక మేకర్స్ కూడా ఎప్పుడో ఒకటి అప్ డేట్ ఇస్తుండేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర్లో ఉంది కాబట్టి ఇప్పటినుండే బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు రిలీజ్ అయ్యాయి. ఒక పక్క తెలుగు పాటలు రిలీజ్ చేస్తూనే మరోపక్క వేరే భాషల్లో కూడా పాటలు రిలీజ్ చేస్తున్నారు.

"రాధేశ్యామ్" డబ్బింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం…

'రాధేశ్యామ్'.. ఆకట్టుకుంటున్న 'నగుమోము' మెలోడీ సాంగ్
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. మొత్తానికి చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో చిత్రయూనిట్ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తుంది. దీనిలో భాగంగానే పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ‘ఈ రాతలే’ అంటూ రిలీజ్ అయిన పాట మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

'ప్రభాస్' రాకపై 'పుష్ప' టీమ్ క్లారిటీ..!
సుకుమార్-అల్లు అర్జున్కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒకవైపు మిగిలి ఉన్న షూట్ ను పూర్తి చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తుంది. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో వస్తున్న భారీ సినిమా కావడంతో అదే రేంజ్ లో అన్నీ ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇందులో స్పెషల్ సాంగ్ కోసం సమంతను సైతం పట్టుకొచ్చారు. సమంత రాకతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.