పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల అన్ని సినిమాల్లాగే ఈసినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఆషికి ఆ గయీ సాంగ్ తో హిందీలో కూడా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే రీసెంట్ గానే రాధే శ్యామ్ హిందీ వెర్షన్ నుండి రెండవ సింగిల్ సోచ్ లియా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈరోజు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మంచి ఎమోషనల్ గా సాగే ఈపాటను అర్జిత్ సింగ్ పాడగా.. మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించారు.
Pour your heart out with this melody! Presenting #SochLiya from the #MusicalOfAges #RadheShyam!https://t.co/n1LTkKRUMW@Mithoon11, @arijitsingh & @manojmuntashir
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/ESP0IgO1vi
— UV Creations (@UV_Creations) December 8, 2021
కాగా యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: