అప్పట్లో అయితే రాధేశ్యామ్ నుండి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండేవారు. ఇక మేకర్స్ కూడా ఎప్పుడో ఒకటి అప్ డేట్ ఇస్తుండేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర్లో ఉంది కాబట్టి ఇప్పటినుండే బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు రిలీజ్ అయ్యాయి. ఒక పక్క తెలుగు పాటలు రిలీజ్ చేస్తూనే మరోపక్క వేరే భాషల్లో కూడా పాటలు రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా హిందీ వర్షన్ లో ఒక పాటను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాట టీజర్ ను రిలీజ్ చేశారు. సోచ్ లియా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ఈ పాటను పాడగా.. మిథున్ స్వరపరిచారు. మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించారు. ఇక టీజర్ ను చూస్తుంటే ఎమోషనల్ గా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక పూర్తి పాటను డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
When the heart breaks, it sings a song of its own. Second Hindi Single #SochLiya Teaser out now, Song out on 8th December.https://t.co/0fL7L29nyv#MusicalOfAges #RadheShyam@Mithoon11, @arijitsingh & @manojmuntashir
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/T67CJfvtey
— UV Creations (@UV_Creations) December 6, 2021
కాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా ఇది. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో ప్రభాస్ విక్రమాధిత్యగా, పూజా హెగ్డే ప్రేరణగా నటిస్తుంది. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: