
ట్యాగ్ · 112 కథనాలు


హరిహర వీరమల్లు.. త్వరలో షూట్‌లోకి పవర్ స్టార్

పవన్ ఇన్ట్సా పోస్ట్- బాధ్యత పెరిగింది

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్

పవన్ కు డిప్యూటీ సీఎం, పలు శాఖల కేటాయింపు

పవన్ కళ్యాణ్‌కు రేణు దేశాయ్ స్పెషల్ విషెస్

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్

పవన్ బర్త్ డే రోజు రానున్న సప్రైజ్ లు ఇవే


పవన్ OG యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్

పూణే లో పవన్ OG కొత్త షెడ్యూల్
ఓజి షూటింగ్ అప్డేట్

OG సెట్ లో అడుగుపెట్టిన పవన్

టాకీ పూర్తి చేసిన పవన్

ప్రారంభం అయిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ

సుజీత్ కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ దర్శకుడు సుజీత్ కి విలువైన కారును బహుమతిగా ఇచ్చి సప్రయిజ్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన ఓజీ 300కోట్ల పైన్ వసూళ్లను రాబట్టుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. స్వయంగా సుజీత్, పవన్ కి వీరాభిమాని కావడంతో సినిమా అనౌన్స్ మెంట్ దగ్గరినుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆతరువాత సినిమా సాంగ్స్ ,ప్రమోషనల్ కంటెంట్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి పవన్ కు కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ కళ్యాణ్ గూస్‌బంప్స్ స్పీచ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం హైదరాబాద్‌లోని LB నగర్ స్టేడియంలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ ప్రియాంక మోహన్, విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీతో పాటు ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్‌రాజు, వై.రవిశంకర్, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఓజీ గురించి, తన సినీ ప్రస్థానం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయి.

హరిహర వీరమల్లు.. త్వరలో షూట్‌లోకి పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అన్నయ్య కావలసిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారు - పవన్ కళ్యాణ్
నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని, కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని పేర్కొన్నారు మెగాస్టార్ సోదరుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు చిరంజీవి జన్మదినం సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. అందులో అన్నయ్య చిరంజీవి గొప్పతనం గురించి వివరించిన ఆయన, చిరు వంటి వ్యక్తిని అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటానని చెప్పారు.

పవన్ ఇన్ట్సా పోస్ట్- బాధ్యత పెరిగింది
సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఉంటాయి సినిమా కలెక్షన్స్ కూడా.. ఫ్లాప్ సినిమాకు కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకునే క్రేజ్ ఆయన సొంతం. ఇక సినిమాల్లో ఎలాగైతే తన మార్కును చూపించాడో ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన మార్కును వేసుకోగలిగాడు. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యాడు.

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే కదా. తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లను వందకు వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం గా గౌరవం దక్కడంతో పాటు నాలుగు శాఖలను కూడా పవన్ కు కేటాయించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు.

పవన్ కు డిప్యూటీ సీఎం, పలు శాఖల కేటాయింపు
ఏపీలో ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే కదా. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ తో సహా మిగిలిన వారు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులకు ఏ శాఖలు వస్తాయా అని చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ శాఖ తీసుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు శాఖలు దక్కాయి.

పవన్ కళ్యాణ్‌కు రేణు దేశాయ్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక అంతకుముందు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. కాగా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఎక్కువ స్థానాలు (21) గెలుచుకోవడంతోపాటు ఆయన కూడా స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో నెగ్గిన విషయం తెలిసిందే.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠంగా జరిగాయి. అందుకు పదిరెట్లు ఉత్కంఠతతో ఏపీ ఎన్నికల ఫలితాల రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూశారు. ఆ రిజల్ట్ జూన్ 4వ తేదీన వచ్చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అంతేకాదు ఈ కూటమి దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించడానికి ఈ కూటమి ఎంతగానో తోడ్పడింది. ఈనేపథ్యంలోనే మోడీ మూడీసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. సతీసమేతంగా ఇటలీకి పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలికాలంలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాజకీయంగానూ పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన తన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఇటలీకి పయనమయ్యారు. కాగా పవన్ సోదరుడు నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరియు నటి లావణ్య త్రిపాఠిల వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబంతో సహా ఇటలీకి బయలుదేరారు. ఈ క్రమంలో తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్…

పవన్ బర్త్ డే రోజు రానున్న సప్రైజ్ లు ఇవే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.ఈసందర్భంగా తను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుండి సప్రైజ్ లు ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.అందులో భాగంగా ఓజీ నుండి అదే రోజు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈవిషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటెర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.ఈరోజు సాయంత్రం రిలీజ్ టైం కూడా చెప్పనున్నారు. ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు తన అభిమానులతో పాటుగా ఎంతోమంది సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్.. "తెలుగు చిత్ర సీమలో తనదైన పంధా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణగారి…

పవన్ OG యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ముందు ముందు పవన్ రాజకీయాలతో బీజీగా ఉండాల్సి వస్తుంది అందుకే ఇప్పుడే వీలైనన్ని రోజులు షూటింగ్ లకు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ అటు హరీష్ శంకర్ సినిమాతో అలానే సుజీత్ ఓజీతో షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ లను మాత్రం చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. గత నెలలో ఓజీ సినిమా షూటింగ్ ను ముంబైలో మొదలుపెట్టగా అక్కడ కొన్ని రోజులు షూట్ ను జరుపుకొని ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. అనంతరం మరో షెడ్యూల్ ను పూణేలో రీసెంట్ గానే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈషెడ్యూల్ లో శ్రీలీల కూడా జాయిన్…

పూణే లో పవన్ OG కొత్త షెడ్యూల్
పవర్ స్టార్ మాత్రం ప్రస్తుతం బ్రేక్స్ లేకుండా సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో పలు ప్రాజెక్ట్ ఉండగా అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టైటిల్ తో వస్తుంది. టైటిల్ కు తగ్గట్టే ఈసినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రీసెంట్ గానే అక్కడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అప్పుడే మరో షెడ్యూల్ ను ప్రారంభించేశారు. పూణేలో ఓజీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు…
ఓజి షూటింగ్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ఈరోజుతో ముగిసింది. గత నెలలో ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం కాగా ఈరోజు తో తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా పవన్ స్టిల్ ను రిలీజ్ చేశారు.ఈస్టిల్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ స్టిల్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఇక మొదటి షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరక్కించారు.తదుపరి షెడ్యూల్ మహాబలేశ్వర్ లో జరుగనుంది.ఈషెడ్యూల్ లో పవన్ అలాగే హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ లపై పాటను చిత్రీకరించనున్నారు.

OG సెట్ లో అడుగుపెట్టిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలపైన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా తరువాత మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే సముద్రఖని సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఒక వారం రోజులు ఆసినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు సుజీత్ సినిమాకు రెడీ అయ్యాడు.

టాకీ పూర్తి చేసిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో మరోవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిని ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ వెళుతున్నారు. ఈమధ్యనే సముద్రఖని సినిమాను ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఈసినిమా అలా ప్రకటించారో లేదో వెంటనే షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు. అంతేకాదు పవన్ కూడా ఈసినిమా కోసం డేట్లు ఫిక్స్ చేసి షూటింగ్ లో వెంటనే పాల్గొన్నాడు. ఇక పవన్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తవుతుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా పవన్ షూట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ టాకీ పార్ట్ పూర్తయిందని…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ@27 ఇయర్స్
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పవన్ కళ్యాణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ , మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో పవర్ స్టార్ గా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, వినోదయ సిత్తం తమిళ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

ప్రారంభం అయిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

14 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన అన్ స్టాపబుల్ 2 పవన్ ఎపిసోడ్ 1
మెుట్టమెుదటిసారిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , బాలయ్యతో అన్‌స్టాపబుల్ షో2 లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొంచెం ఫన్, పాలిటిక్స్, పర్సనల్ విశేషాలతో ఈ ఎపిసోడ్ రూపొందింది ఈ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కు ఆహా టీం నిర్ణయం తీసుకుంది.ఆహా టీమ్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నా విషయం తెలిసిందే.