హరిహర వీరమల్లు.. త్వరలో షూట్‌లోకి పవర్ స్టార్

Hari Hara Veera Mallu Power Star Pawan Kalyan Will Join Shoot in Soon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చిత్రీకరణకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఇటీవలే తిరిగి చిత్రీకరణలో పాల్గొన్నారు. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్ర బృందం చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400-500 మంది ఆర్టిస్టులు పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశానికి యాక్షన్ దర్శకుడిని ప్రత్యేకంగా నియమించారు.

ఈ నేపథ్యంలో మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. కొంత గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ మళ్ళీ త్వరలోనే మూవీ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. “ధర్మ కోసం ఎపిక్ బ్యాటిల్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ యుద్ధం దారుణంగా, గొప్పగా మరియు చిరస్మరణీయంగా ఉంటుందని మేము మీకు హామీ ఇస్తున్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ వారాంతం నుండి మన హరి హర వీర మల్లు షూటింగ్‌లో జాయిన్ కానున్నారు” అని హరి హర వీర మల్లు టీమ్ పేర్కొంది.

కాగా ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్ ఖర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, అయ్యప్ప శర్మ, సునీల్, నీహార్ కపూర్, సుబ్బరాయ శర్మ, సుబ్బరాజు, కబీర్ దుహన్ సింగ్, నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, దలీప్ తాహిల్, అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అలాగే ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.