ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. పవన్ కళ్యాణ్ గూస్‌బంప్స్ స్పీచ్

Power Star Pawan Kalyan's Goosebumps Speech at OG Pre Release Event

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం హైదరాబాద్‌లోని LB నగర్ స్టేడియంలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ ప్రియాంక మోహన్, విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీతో పాటు ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్‌, దిల్‌రాజు, వై.రవిశంకర్‌, కోన వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఓజీ గురించి, తన సినీ ప్రస్థానం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుజిత్‌, తమన్‌లపై ప్రశంసలు

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ‘సాహో’ తర్వాత నా లాంటి స్టార్‌తో సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. సుజిత్ నన్ను బాగా అర్థం చేసుకుని, ఈ సినిమాను ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తీర్చిదిద్దారు. అలాగే తన విజన్‌కి తగ్గట్టుగా తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వీరిద్దరితో కలిసి పనిచేయడం నాకు మరిచిపోలేని అనుభవం. ‘జానీ’ టైమ్‌లో ఇలాంటి టీమ్ ఉండుంటే, నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు” అని పవన్ తెలిపారు.

‘ఓజీ’ గురించి..

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలోని తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. “ఓజాస్ గంభీర’ అనే ఈ పాత్ర పేరు ఈ సినిమాకు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలియజేస్తుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. దీనిలో యాక్షన్, ఎమోషన్స్, మరియు ఫ్యామిలీ అంశాలు ఉంటాయి. ‘ఓజీ’ కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు, ఇందులో చాలా ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటుంది” అని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం అని మర్చిపోయా..

“ఈ రోజు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయా. ఇక్కడికి సినిమాలో కనిపించే కాస్ట్యూమ్‌తో వచ్చానంటే మీకోసం. నిజజీవితంలో డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని తిరగగలడా? సినిమాలాగే చూడాలి. సినిమాలు వదిలేసి పాలిటిక్స్‌లోకి వెళ్లినా మీరు నన్ను వదల్లేదు. ఈ రోజు ప్రజలకోసం కొట్లాడుతున్నానంటే మీరిచ్చిన బలం. తెలుగోడు అంటే ఉరుముతోంది ఆకాశం.

అభిమానులకు ధన్యవాదాలు

ఈవెంట్‌కు హాజరైన అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. “మీ ప్రేమ, మీ అభిమానం నా సినిమాలు తీయడానికి ఒక స్ఫూర్తిని ఇస్తాయి. ఇంత పెద్ద వర్షం కూడా మనల్ని ఆపలేదు.” అని అన్నారు. ఈ ప్రసంగంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ‘ఓజీ’ థియేటర్లలో ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.