జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే కదా. తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లను వందకు వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం గా గౌరవం దక్కడంతో పాటు నాలుగు శాఖలను కూడా పవన్ కు కేటాయించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు తన బాధ్యతలు స్వీకరించారు పవన్. విజయవాడలో పవన్ కు కేటాయించిన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పలు ఫైళ్లపై సంతకాలు చేశారు.
కాగా మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. కూటమి ఘన విజయం సాధించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























