పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ దర్శకుడు సుజీత్ కి విలువైన కారును బహుమతిగా ఇచ్చి సప్రయిజ్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన ఓజీ 300కోట్ల పైన్ వసూళ్లను రాబట్టుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. స్వయంగా సుజీత్, పవన్ కి వీరాభిమాని కావడంతో సినిమా అనౌన్స్ మెంట్ దగ్గరినుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆతరువాత సినిమా సాంగ్స్ ,ప్రమోషనల్ కంటెంట్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి పవన్ కు కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో పవన్ ను చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈసినిమాతో పవన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడంతో ప్రతి ఫలంగా దర్శకుడికి ఖరీదైన బహుమానం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ను సుజీత్ కి ప్రెసెంట్ చేశారు. దాంతో సుజీత్ ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇది అత్యుత్తమ బహుమతి. మాటలకు అందని ఆనందం. నా ప్రియమైన OG, కళ్యాణ్ గారి నుండి వచ్చిన ఈ ప్రేమ, ప్రోత్సాహం నాకెంతో ముఖ్యం. చిన్ననాటి అభిమాని నుండి ఈ ప్రత్యేక క్షణం వరకు…ఎప్పటికీ రుణపడి ఉంటాను అని సుజిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇక ఓజీ సీక్వెల్ కూడా రానుంది. అయితే ఇప్పుడప్పుడే ఈ సీక్వెల్ స్టార్ట్ అవ్వడం కష్టమే.ప్రస్తుతం సుజీత్ వేరే స్క్రిప్ట్ మీద బిజీ గా వున్నాడు. ఆ సినిమా పూర్తి చేసుకొని ఓజీ సీక్వెల్ ను మొదలుపెట్టే ఛాన్స్ వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























