పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ముందు ముందు పవన్ రాజకీయాలతో బీజీగా ఉండాల్సి వస్తుంది అందుకే ఇప్పుడే వీలైనన్ని రోజులు షూటింగ్ లకు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ అటు హరీష్ శంకర్ సినిమాతో అలానే సుజీత్ ఓజీతో షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ లను మాత్రం చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. గత నెలలో ఓజీ సినిమా షూటింగ్ ను ముంబైలో మొదలుపెట్టగా అక్కడ కొన్ని రోజులు షూట్ ను జరుపుకొని ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. అనంతరం మరో షెడ్యూల్ ను పూణేలో రీసెంట్ గానే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈషెడ్యూల్ లో శ్రీలీల కూడా జాయిన్ అవ్వనున్నట్టు అప్పుడే అప్ డేట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు చిత్రయూనిట్ సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది. ఈసినిమా పవర్ ప్యాక్ట్ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు చిత్రనిర్మాణ సంస్థ తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Drama, Action, Love and Melody…
A power-packed long schedule is now wrapped up! #OG #TheyCallHimOG #FireStormisComing 🔥🔥🤙🏻 pic.twitter.com/Z9LeDQPGwl
— DVV Entertainment (@DVVMovies) May 9, 2023
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: