
ట్యాగ్ · 59 కథనాలు


ధనుష్-నాగార్జున మూవీ థర్డ్ షెడ్యూల్ లోకి ఎంట్రీ

నాగ్ సంక్రాంతి హ్యాట్రిక్

నాగార్జున నా సామి రంగ గ్లింప్స్ రిలీజ్

నాగార్జున న్యూ మూవీ షూటింగ్ అప్ డేట్

నాగార్జున ది ఘోస్ట్ మూవీ రిలీజ్ ట్రైలర్

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్

"బంగార్రాజు" మూవీ ప్రమోషన్స్ షురూ

అఫీషియల్.. సంక్రాంతి బరిలోకి 'బంగార్రాజు'

త్వరలో రానున్న 'బంగార్రాజు'.. షూట్ లాస్ట్ డే

ఆ అభిమానిని కలుసుకున్న నాగార్జున
టాలీవుడ్ అగ్ర నటుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున గొప్ప మనస్సు చాటుకున్నారు. ఇటీవల ఒక అభిమానిని తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుని నెట్టివేయడం, ఆ వీడియో నెట్టింట వైరల్ అవడం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన నాగార్జున కూడా సదరు అభిమానికి సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో తన బాడీగార్డ్ చేసిన పనికి విచారణం వ్యక్తం చేసిన ఆయన మరోసారి అలా జరుగకుండా చూసుకుంటానని అప్పుడు హామీ కూడా ఇచ్చారు.

మన్మథుడులో అందుకు నాగార్జున ఒప్పుకోలేదు - విజయ్ భాస్కర్
టాలీవుడ్ సీనియర్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కె విజయ్ భాస్కర్ ఎన్నో విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను ప్రేక్షకులకు అందించారు. ఆయన దర్శకత్వం వహించిన స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి మరియు జై చిరంజీవ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన కొంత విరామం తర్వాత ఇప్పుడు 'ఉషాపరిణయం' అనే ఓ కొత్త సినిమాను తెరకెక్కించారు.

ధనుష్-నాగార్జున మూవీ థర్డ్ షెడ్యూల్ లోకి ఎంట్రీ
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈసినిమాను ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంత టైమ్ పట్టింది. గత నెలలోనే ఈసినిమాను పూజాకార్యక్రమాాలతో ప్రారంభించారు.

నాగ్ సంక్రాంతి హ్యాట్రిక్
కింగ్ నాగార్జునకు సంక్రాంతి బాగా కలిసొచ్చింది.ఈసీజన్ లో విడుదలైన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి అందుకే ఈసారి పట్టు బట్టి మరీ సంక్రాంతి రేస్ లో దిగాడు.నాగ్ నటించిన నా సామి రంగ గత ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే.మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా హిట్ దిశగా దూసుకుపోతుంది.మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.రేపటి తో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.పండుగ సెలవులను పర్ఫెక్ట్ గా వాడుకొని వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాలను తీసుకురానుంది.

నాగార్జున నా సామి రంగ గ్లింప్స్ రిలీజ్
కింగ్ నాగార్జున 99వ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాకు నా సామి రంగ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈసినిమాతో డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.నాగ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశార.ఇక ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఈ సినిమాలో నాగ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.

ఫ్యాన్స్‌కి నాగార్జున 'బర్త్ డే' ట్రీట్.. 'మన్మథుడు' రీ రిలీజ్
టాలీవుడ్ గ్రీకువీరుడు అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. తన 'బర్త్ డే' సందర్భంగా.. ఆయన వారికి సూపర్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఈనెల 29న కింగ్ నాగార్జున జన్మదినం అన్న విషయం ఆయన అభిమానులతో పాటు సినీప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగార్జున కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాల్లో ఒకటిగా పేరొందిన ‘మన్మథుడు’ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా ‘మన్మథుడు’ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించిన సంగతి తెలిసిందే.

ఉగాది పండగ కి నాగార్జున న్యూ మూవీ ఫస్ట్ లుక్ ?
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ లో కామెడీ హీరోలు అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ తో రైటర్ ప్రసన్న కుమార్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

హీరో నాగార్జున కు జోడీగా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ?
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా మూవీస్ ఫేమ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 1970 -80 ల నేపథ్యంలో పీరిడికల్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా ఎంటర్‌టైనర్‌గా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ వచ్చే నెలలో మైసూర్‌లో మొదలు కానుందని సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

నాగార్జున న్యూ మూవీ షూటింగ్ అప్ డేట్
విక్రమ్ (1986 ) మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో సుమారు 100 సినిమాలకు పైగా నటించిన నాగార్జుననటుడు, నిర్మాత, టీవీ ప్రెజెంటర్ గా రాణిస్తున్నారు. అన్నమయ్య మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2002 సంవత్సరంలో బంగార్రాజు, ది ఘోస్ట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నాగార్జున తాజాగా ఒక పీరియాడికల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ది ఘోస్ట్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది. అందరూ కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు

ది ఘోస్ట్ హిందీ వెర్షన్ విక్రమ్ ది ఘోస్ట్ రిలీజ్ డేట్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్ , ట్రైలర్…

నాగార్జున ది ఘోస్ట్ మూవీ రిలీజ్ ట్రైలర్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్ , ట్రైలర్…

"ది ఘోస్ట్ " మూవీ సోనాల్ చౌహాన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్.. బీ రెడీ..!
బుల్లి తెర ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్ బాస్ అగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి కాగా ఆరో సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ గ్యాప్ లో ఓటీటీ బిగ్ బాస్ కు శ్రీకారం చుట్టూరు. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో ఓటీటీ బిగ్ బాస్ ప్రసారం అవుతూనే ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే పలు ప్రోమోలు కూడా వచ్చేశాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ షో ప్రసారం కానుంది.

1,080 ఎకరాల ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న నాగార్జున..!
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పటికే విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్ని ఎన్నో మొక్కలను నాటారు. ఇక దీనిలో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాజిపల్లిలో 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే కదా. తన తండ్రి పేరిట ప్రభాస్ దానిని అభివృద్ధి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో అగ్రహీరో కూడా ముందుకొచ్చారు. ఆ అగ్రహీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున.

రివ్యూ.. 'బంగార్రాజు' కి కలిసొచ్చిన పండుగ
ఫైనల్ గా చెప్పాలంటే మొత్తంగా సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. దానికితోడు పోటీలో పెద్ద సినిమాలేవి లేకపోవడం ‘బంగార్రాజు’కు కలిసొచ్చింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా అని చెప్పొచ్చు.

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్
నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. బంగార్రాజు పాత్రలో తన చలాకీ నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నాడు నాగార్జున. అందుకే ఈ పాత్ర పేరుతోనే ఇప్పుడు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాతో వచ్చేస్తున్నారు. అయితే ఈసినిమాలో నాగార్జునతో పాటు తనయుడు నాగచైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. దీంతో ఈసినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది అందరికీ. తండ్రీకొడుకులిద్దరూ మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులు సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"బంగార్రాజు" మూవీ ప్రమోషన్స్ షురూ
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటించారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను…

అఫీషియల్.. సంక్రాంతి బరిలోకి 'బంగార్రాజు'
ఈ ఏడాది సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. పోటీ ఓ రేంజ్ లో ఉంటుంది అని.. ఏ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఒక సినిమా తరువాత మరొకటి వరుసగా వాయిదా పడుతూ.. ఇప్పుడు ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కు లేకుండా పోయాయి. ఇక నిన్నటి వరకూ రిలీజ్ అవుతుందిలే అనుకున్న రాధేశ్యామ్ కూడా నేడు రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా నిరాశే ఎదురైంది. ఇక పెద్ద సినిమాలు పోటీకి లేకపోవడంతో ఏ ఏడాది లేనంతగా ఈ ఏడాది చిన్న సినిమాలకు ఛాన్స్ దొరికింది. దీంతో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

త్వరలో రానున్న 'బంగార్రాజు'.. షూట్ లాస్ట్ డే
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున -నాగచైతన్య ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బంగార్రాజు అసలు ఈసినిమా సీక్వెల్ ఎప్పుడో అనుకున్నారు కానీ అది సెట్స్ పైకి వెళ్లేసరికే చాలా ఆలస్యమైంది. మధ్యలో కరోనా కూడా రావడంతో ఇంకా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈసినిమాను ప్రారంభించారు. అలా ప్రారంభించారో లేదో ఎక్కడా గ్యాప్ లేకుండా చాలా తొందరగానే కంప్లీట్ చేసేశారు. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. ప్రస్తుతం నాగచైతన్య-కృతిశెట్టి కు సంబంధించి ఒక సాంగ్ ను చిత్రీకరిస్తుండగా నేటితో షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలిపింది. ఇక ఒక పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా…