కింగ్ నాగార్జునకు సంక్రాంతి బాగా కలిసొచ్చింది.ఈసీజన్ లో విడుదలైన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి అందుకే ఈసారి పట్టు బట్టి మరీ సంక్రాంతి రేస్ లో దిగాడు.నాగ్ నటించిన నా సామి రంగ గత ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే.మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా హిట్ దిశగా దూసుకుపోతుంది.మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.రేపటి తో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.పండుగ సెలవులను పర్ఫెక్ట్ గా వాడుకొని వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాలను తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో నాగ్ హ్యాట్రిక్ కొట్టాడు.సోగ్గాడే చిన్నినాయన నుండి చూస్తే 2016లో సంక్రాంతికి వచ్చిన ఈసినిమాతో నాగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు.ఇక 2022 లో ఈసినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సంక్రాంతి కి వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు నా సామి రంగతో సక్సెస్ ఫుల్ గా సంక్రాంతికి హ్యాట్రిక్ పూర్తి చేశాడు నాగ్.
నా సామి రంగ ను ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేయగా అల్లరి నరేశ్,రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించారు.నాగ్ తరువాత హీరోయిన్ ఆషికా రంగనాథ్,అల్లరి నరేష్ నటన సినిమాలో హైలైట్ అయ్యాయి.వీరికి తోడు కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లస్ అయ్యింది.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: