ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, వేగం సాంగ్, తమహాగనే థీమ్ సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ అన్నీ ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. నాగ్ కు ఎలాంటి విజయాన్ని అందించింది అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్
దర్శకత్వం.. ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు.. సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్
బ్యానర్స్.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్
సంగీతం.. మార్క్ కె.రాబిన్స్
సినిమాటోగ్రఫి..ముఖేష్ జి
కథ..
విక్రమ్ (నాగార్జున) ఒక ఇంటర్‌పోల్ ఏజెంట్. ఇక ఒకే డిపార్ట్ మెంట్ లో పనిచేసే తోటి ఇంటర్‌పోల్ ఆఫీసర్ ప్రియ(సోనాల్ చౌహాన్)తో ప్రేమలో ఉంటాడు. అలా అతని ప్రొఫెషనల్ లైఫ్ సాఫీగా సాగుతున్న టైమ్ లో ఒక సంఘటన వల్ల తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. దానివల్ల తన ఉద్యోగానికి కూడా దూరంగా ఉంటాడు. అలా సాగుతున్న నేపథ్యంలో కొన్ని సంవత్సరాల తరువాత అను (గుల్ పనాగ్) దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. తనకు, తన కూతురు అదితికి (అనిఖా సురేంద్రన్) ప్రాణ హాని ఉందని విక్రమ్ సాయం కోరుతుంది. అను ఎవరు? ఆమె విక్రమ్ సహాయం ఎందుకు కోరింది? అను, అదితికి ముప్పు ఏంటి? అనుకు విక్రమ్‌కి ఉన్న అనుబంధం ఏమిటి? అన్నది మిగిలిన కథ..
విశ్లేషణ
ఈఏడాది ఇప్పటికే బంగార్రాజు, బ్రహ్మాస్త్ర సినిమాలతో సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమాతో మరో హిట్ ను అందుకున్నాడని చెప్పొచ్చు. సినిమా మొదలైనప్పటినుండీ ఈసినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెపుతూనే ఉన్నారు. ఇక చెప్పినట్టే ఈసినిమా చూశాక అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు తీయడంపై ప్రవీణ్ సత్తారుకు ఉన్న పట్టు ఈ సినిమాలో ఉన్న ప్రతి ఫైట్‌లో కనిపిస్తుంది. పోరాట సన్నివేశాలన్నీ హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో ఉంది. ఈ మూవీని పూర్తిగా ఇంటర్ పోల్ నేపథ్యంలో తెరకెక్కించాడు. తన వాళ్లకు ఏమైనా జరిగితే విక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనే ఎమోషన్‌ను వయొలెన్స్ ద్వారా చక్కగా ప్రెజెంట్ చేశారు. మాస్ ఆడియన్స్ తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా సెంటిమెంట్ సీన్స్‌ను కూడా డిజైన్ చేశాడు. ఇక చివరలో ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది.
పెర్ఫామెన్స్
నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటది. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. ఈ విషయాన్ని తన కెరీర్‌లో చాలాసార్లు నిరూపించుకున్నాడు. ది ఘోస్ట్‌తో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. అందులోనూ నాగార్జునకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు గతంలో కూడా చేశాడు కాబట్టి చాలా ఈజ్ తో చేసేశాడు. విక్రమ్ గా అతని నటన ఈ చిత్రం కి అతి పెద్ద ప్లస్ పాయింట్. సోనాల్ చౌహాన్ పాత్ర కూడా ఇందులో పర్ ఫెక్ట్ గా సూట్ అయిపోయేలా ఆమె నటించింది. కార్పొరేట్ సంస్థ అధినేత్రిగా గుల్ పనాగ్, ఆమె కూతురుగా అనిఖా సురేంద్రన్ చక్కగా నటించారు. విలన్ మనీశ్ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.
టెక్నికల్ వాల్యూస్
ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకు నేపథ్య సంగీతం కూడా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు అందించారు. మార్క్ కే.రాబిన్స్, భరత్-సౌరభ్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. దినేశ్ సుబ్బరాయన్, కేచ్ డైరెక్ట్ చేసిన యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ ముఖేష్.జి విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగా రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది. అందరూ కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: