మన్మథుడులో అందుకు నాగార్జున ఒప్పుకోలేదు – విజయ్ భాస్కర్

Director K Vijaya Bhaskar Praises Nagarjuna Acting in Manmadhudu

టాలీవుడ్ సీనియర్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కె విజయ్ భాస్కర్ ఎన్నో విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను ప్రేక్షకులకు అందించారు. ఆయన దర్శకత్వం వహించిన స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి మరియు జై చిరంజీవ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన కొంత విరామం తర్వాత ఇప్పుడు ‘ఉషాపరిణయం’ అనే ఓ కొత్త సినిమాను తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇందులో విజయ్ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా నటించడం విశేషం. యువ నటి తన్వీ ఆకాంక్ష ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ మూవీని క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ క్రమంలో డైరెక్టర్ విజయ్ భాస్కర్ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

దీనిలో భాగంగా తాజాగా తెలుగు ఫిల్మ్ నగర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గత చిత్రాలకు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ తన సూపర్ హిట్ ఫిల్మ్ ‘మన్మథుడు’ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాతో సరదాగా సాగిన సంభాషణలో ఆ సినిమా చిత్రీకరణ సమయంలో హీరో నాగార్జునతో తనకెదురైన అనుభవాలను వివరించారు.

ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ హీరో అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ.. “నాగార్జున అద్భుతమైన నటుడు. ఆయన ఒక్కసారి కథను అర్థం చేసుకున్న తర్వాత పూర్తి నమ్మకంతో తన పాత్రను పోషిస్తాడు. ఇతర విషయాలలో ఏమాత్రం జోక్యం చేసుకోడు. ఒక స్థాయిలో ఉన్న నటులు కొన్ని కొన్ని సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడరు. అయితే నాగ్‌కు అలాంటి పట్టింపులేమి లేవు. అయితే, నాగార్జున జీరో ఇన్హిబిషన్స్ ఉన్న నటుడు” అని పేర్కొన్నారు.

దీనికి ఉదాహరణగా విజయ్ భాస్కర్ ఇలా తెలిపారు.. “ఓ సన్నివేశంలో నాగార్జున టేబుల్‌ కింద దాక్కోవలసి వస్తుంది. ఇలాంటి సీన్స్ చేయడానికి పెద్ద హీరోలు సాధారణంగా ఒప్పుకోరు. కానీ, సీన్ వివరించిన వెంటనే నాగార్జున ఎలాంటి తటపటాయింపు లేకుండా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో కేవలం తన ఎక్స్‌ప్రెషన్స్ ద్వారానే ఆయన సున్నితమైన భావాలు పలికించాడు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమాలో ఒక కీలకమైన సీక్వెన్స్‌లో ఒక డూప్‌ను (స్టంట్ చేయడానికి) పెట్టి తీద్దామని అనుకున్నాం. అయితే దీనికి నాగార్జున ఒప్పుకోలేదు. అందులో ఆయన పెద్ద నీటి ప్రదేశంలోకి దూకవలసి వచ్చింది. నాగ్ డూప్ లేకుండానే నిజంగానే నీళ్ళలోకి దూకేశాడు. ఇక సినిమాలో బ్రహ్మానందం గారితో ఐకానిక్ ఎస్కలేటర్ సీన్ అందరికీ గుర్తుండే వుంటుంది. ఒక ముఖ్యమైన సన్నివేశానికి సిద్ధం కావాలని మేము అతనిని కోరాము” అని చెప్పారు.

“దీనికోసం ఆయన ఇండియా నుండి ఫ్రాన్స్‌కు బయలుదేరాడు. అయితే బ్రహ్మానందం విమానాశ్రయంలోనే ఈ సన్నివేశం కోసం అప్పటికప్పుడు సిద్ధమయ్యాడు. నాగార్జున, బ్రహ్మ్మనందం కాంబినేషన్ లో వచ్చే ఈ సీన్ సినిమాలో బ్రహ్మాండంగా వర్కవుట్ అయింది. అలాగే రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. వ్యక్తిగతంగా ఈ సినిమా తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది” అని నాటి విశేషాలను పంచుకున్నారు డైరెక్టర్ విజయ్ భాస్కర్.

కాగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మధుడు’ తెలుగు క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి బింద్రే మరియు అన్షు కథానాయికలుగా నటించగా.. సీనియర్ నటుడు బాలయ్య, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుధ, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.