బుల్లి తెర ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్ బాస్ అగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి కాగా ఆరో సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ గ్యాప్ లో ఓటీటీ బిగ్ బాస్ కు శ్రీకారం చుట్టూరు. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో ఓటీటీ బిగ్ బాస్ ప్రసారం అవుతూనే ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే పలు ప్రోమోలు కూడా వచ్చేశాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ షో ప్రసారం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరికొద్ది గంటల్లో ఈ షో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ షోకు నాగార్జునే హోస్ట్. ఈనేపథ్యంలో నాగార్జున తన ట్విట్టర్ ద్వారా మరోసారి అప్ డేట్ ఇస్తున్నారు. హలో హలో హలో.. మరి కొద్ది గంటల్లో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ షురూ కాబోతుంది.. ఫన్ టాస్టిక్ రైడ్ కోసం అందరూ రెడీ గా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.
💥Hello hello hello💥
Inka konni Ghantallo
24/7 #BiggBossNonStop entertainment shuru!!!Be ready for a nonstop FUNtastic ride 😃😀😀
@disneyplushotstar @endemolshineind #DisneyPlusHSTel
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 26, 2022
ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురి కంటెస్టెంట్ల్ పేర్లు తెరపైకి వచ్చాయి. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియనాతో పాటు మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజలు కూడా ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ లో ఇంట్లోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు వినిపిస్తుంది. కానీ పైనల్ కంటెస్టెంట్స్ ఎవరో అన్నది మాత్రం ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటలకు మాత్రమే తెలియనుంది. మరి ఇప్పటివరకూ ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో ఉండేది.. ఇప్పుడు 24 గంటలు ఈ షో రన్ కాబోతుంది. చూద్దాం ఈ షో ఎంతవరకూ క్లిక్ అవుతుందో..
ఇక ఇటీవలే బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను కొట్టారు నాగార్జున. ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో చేసిన బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ రాగా రీసెంట్ గానే మళ్లీ రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది ఈసినిమా.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























