టాలీవుడ్ అగ్ర నటుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున గొప్ప మనస్సు చాటుకున్నారు. ఇటీవల ఒక అభిమానిని తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుని నెట్టివేయడం, ఆ వీడియో నెట్టింట వైరల్ అవడం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన నాగార్జున కూడా సదరు అభిమానికి సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో తన బాడీగార్డ్ చేసిన పనికి విచారణం వ్యక్తం చేసిన ఆయన మరోసారి అలా జరుగకుండా చూసుకుంటానని అప్పుడు హామీ కూడా ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, ప్రస్తుతం నాగార్జున ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటిస్తుండగా.. నాగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని జుహూ బీచ్ లో జరుగుతోంది. దీనిలో పాల్గొనేందుకై నాగ్ బుధవారం ముంబై చేరుకున్నారు.
ఈ క్రమంలో నాగార్జున ఆ అభిమానిని కలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు సదరు అభిమాని తారసపడ్డాడు. దీంతో అతనిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడారు. ఆ అభిమాని భుజంపై చేయివేసి కొద్దిసేపు ముచ్చటించారు. ఆ అభిమాని కూడా నవ్వుతూ సమాధానమిచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతకుముందు ఏం జరిగిందంటే..?
ఇటీవలి వరకూ చెన్నైలో షూటింగ్ జరుపుకున్న కుబేర, తాజాగా ముంబైలో కీలక షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనేందుకై నాగార్జునతోపాటు హీరో ధనుష్ కూడా నగరానికి విచ్చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో నాగార్జున నడుచుకుని వస్తుండగా.. అక్కడే ఒక షాపులో పనిచేస్తున్న ఓ అభిమాని నాగ్‌ను కలిసేందుకు ముందుకు వచ్చాడు. అయితే నాగ్ బౌన్సర్ అతడిని అడ్డుకున్నాడు.
అంతటితో ఆగకుండా గట్టిగా పక్కకు తోసేశాడు. దీంతో కిందపడబోయిన ఆ అభిమాని ఎలాగోలా తమాయించుకుని నిలబడ్డాడు. ఈ హఠాత్పరిణామంతో చుట్టుపక్కలవారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కొంతమందికి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా అర్ధం కాలేదు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో హీరో నాగార్జున ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సదరు అభిమానికి క్షమాపణలు చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: