టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంటే వెంటనే థమన్ అని చెప్పేయొచ్చు. ఈ రెండేళ్లలోనే థమన్ ఎంత బిజీ అయిపోయాడో చూస్తూనే ఉన్నాం. పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకూ థమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. చిన్న సినిమాల నిర్మాతలు కనీసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా థమన్ తో చేయించుకోవాలని అంటున్నారు. ప్రస్తుతం అయితే పలు సినిమాలో బిజీగా ఉన్నాడు థమన్. అందులో మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులతో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిరు పుట్టినరోజు సందర్బంగా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. తాజాగా థమన్ ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రాబోతుందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ద్వారా తను ఇంకా ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషాల్ ఫొటో పోస్ట్ చేస్తూ మేము గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ తో రెడీగా ఉన్నాము అంటూ పోస్ట్ లో తెలిపాడు. శ్రేయా ఘోషల్ ఈపాట పాడినట్టు త్వరలోనే ఈపాటను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
View this post on Instagram
కాగా ఈసినిమాలో నయనతార, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: