తమ్ముడికి అన్న బర్త్ డే విషెస్

Megastar Heartfelt Birthday Wishes To Pawan Kalyan, Megastar Chiranjeevi Heartfelt Birthday Wishes To Pawan Kalyan, Birthday Wishes To Pawan Kalyan, Happy Birthday Pawan Kalyan, Megastar Chiranjeevi Wishes His Brother Pawan Kalyan, Chiranjeevi Wishes His Brother Pawan Kalyan, Pawan Kalyan, Power Star Pawan Kalyan, Megastar Chiranjeevi, Chiranjeevi Wishes, Megastar Chiranjeevi Gretings, Chiranjeevi Birthday Wishes to Pawan Kalyan, Happy birthday Pawan Kalyan, Pawan Kalyan turns 50, Pawan Kalyan Birthday wishes, Power Star Pawan Kalyan Latest Movies, Chiranjeevi, Actor Pawan Kalyan, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ పుట్టినరోజు. ఈరోజు కోసం అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఆరోజు రానే వచ్చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా మొద‌ల‌య్యాయి. ఇక ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మరోవైపు ఈ క్ర‌మంలో అటు సినీ ప్ర‌ముఖులు, ఇటు రాజ‌కీయ నాయ‌కుల నుండి పవన్ కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో తన తమ్ముడుకి అన్న చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే.. పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు 💐శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పవన్ ప్రస్తుతం పలు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్భంగా హరిహర వీరమల్లు నుండి పవర్ గ్లాన్స్ పేరుతో వీడియోను రిలీజ్ చేశారు. పవన్ యాక్షన్ గ్లింప్స్ ను చూపించారు. ఈ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు. ఇక ఈసినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేస్తున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో వస్తున్న ఈసినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =