
ట్యాగ్ · 24 కథనాలు


మురారి రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్

మురారి రీ రిలీజ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

మ్యాంగో మ్యూజిక్ లో బ్రో ఆడియో


'#బ్రో' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

"బ్రేకింగ్ న్యూస్ "మూవీ షూటింగ్ ప్రారంభం

అన్నాచెల్లెళ్లుగా అవికా, నవీన్ చంద్ర

'తిమ్మరుసు' కోసం న్యాచురల్ స్టార్

'తిమ్మరుసు' ట్రైలర్ రిలీజ్

సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్ రిలీజ్

'ఏక్ మినీ కథ' ట్రైలర్ రిలీజ్

'ఏక్ మినీ కథ' అవును పోస్ట్ పోన్

మురారి రీ రిలీజ్.. థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ కోలాహలం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’ చిత్రం మళ్ళీ విడుదలైంది. 4k టెక్నాలజీతో సరికొత్త హంగులతో ముస్తాబై నేడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా గ్రాండ్ రీ రిలీజ్ అయింది.

మురారిలో ఆ పాటంటే నాకు చాలా ఇష్టం - సోనాలి బింద్రే
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

మురారి రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

మురారి రీ రిలీజ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఎవర్ గ్రీన్ గా గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో మురారి సినిమా కూడా ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2001లో విడుదలైన ఈసినిమా మహేష్ సినీ కెరీర్ నే ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. కథ, కథాంశం, మహేష్ నటన, పాటలు అన్నీ సినిమా విజయంలో భాగమయ్యాయి.

మ్యాంగో మ్యూజిక్ లో బ్రో ఆడియో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాలపై ద్రుష్టి పెట్టింది చిత్ర యూనిట్ అందులో భాగంగా రీసెంట్ గా బ్రో టీజర్ ను విడుదలచేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ ప్రభావంతో సినిమా రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఓవర్సీస్ రైట్స్ కూడా భారీ ధర పలుకాయని సమాచారం.పీపుల్ సినిమాస్ ఈ రైట్స్ తీసుకుంది.

కొరమీను మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఒక సహజమైన కథను చూడాలంటే కొరమీను సినిమాను చూసి ఎంజాయ్ చెయొచ్చు. ఈసినిమా అన్ని వర్గాల వారు చూసే సినిమా అని చెప్పొచ్చు.

'#BRO'.. అన్నాచెల్లెళ్ల ప్రేమతో ప్రతి ఒక్కరి హార్ట్ టచ్ చేసిన మ్యాంగో మాస్ మీడియా
నవీన్ చంద్ర గత కొంత కాలంగా మంచి చిత్రాలు ఎంచుకుని నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని ఫ్యామిలి ఆడియన్స్ లో సంపాదిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే బ్రో అనే మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈసినిమా నేడు సోని లివ్ ఒటిటి లో విడుదలైంది. ఇక ఎప్పటిలాగే ఈమూవీలో కూడా తన నటనతో అందరి హృదయాల్ని ఆకట్టకున్నాడు. తన తరువాత పుట్టిన చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించే అన్న పాత్రలో జీవించాడనే చెప్పాలి. తన చెల్లెలు ఆరోగ్యం కొసం కావల్సిన డబ్బు కోసం దుబాయ్ వెళ్ళి అక్కడే వుంటూ తన కుటుంబాన్ని ముఖ్యంగా తన చెల్లెల్ని అమితం గా ప్రేమించే అన్న పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గుర్తిండిపోతుంది. అలాగే చెల్లెలు గా…

'#బ్రో' మూవీ రివ్యూ.. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్
సాంకేతిక విభాగానికి వస్తే శేఖర్ చంద్ర అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి అజీమ్ మహమ్మద్ తన పనితనం చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి బ్రో ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. బ్రదర్ అండ్ సిస్టర్ స్వీట్ బాండింగ్ ను మరోసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అందరూ.

'#బ్రో' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
కార్తీక్ తురుపాని దర్శకత్వంలో నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెళ్లుగా వస్తున్న సినిమా బ్రో. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పాటలు టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అవ్వగా వాటితో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మ్యాంగో మాస్ మీడియా, జె. జె. ఆర్. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జె. జె. ఆర్. రవిచంద్ నిర్మిస్తున్న ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

"బ్రేకింగ్ న్యూస్ "మూవీ షూటింగ్ ప్రారంభం
రా ఎంటర్ టైన్ మెంట్స్ , మ్యాంగో మాస్ మీడియా బ్యానర్స్ పై సుబ్బు వేదుల దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న"బ్రేకింగ్ న్యూస్ "మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. సుబ్బరాజు , జె డి చక్రవర్తి , ఝాన్సీ , సురేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బి వి ఎస్ రవి స్టోరీ , డైలాగ్స్ , కళ్యాణ్ వర్మ , వంశీ బలపనూరి , సుబ్బు వేదుల , సందీప్ గాదె స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు.

'ఫ్యామిలీ డ్రామా' రెస్పాన్స్ పై సుహాస్.. చాలా భయపడ్డా..!
మరోసారి తన నటనతో మంచి నటుడని నిరూపించాడు యంగ్ హీరో సుహాస్. మొదటి నుండి సుహాస్ నటన అంటే చాలా మందికి మంచి ఇంప్రెషనే ఉంది. సుహాస్ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పటినుండి కూడా తన నటనకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్లతో పాటు పలు కీలకపాత్రల్లో నటించిన సుహాస్ కలర్ ఫొటో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటిసినిమాతోనే హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ డ్రామా అనే సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సైకో పాత్రలో చేసిన సుహాస్ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

'ఫ్యామిలీ డ్రామా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ఆ సినిమాలో తన నటనకు గాను మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దాంతో సుహాస్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.. ఇక సుహాస్ కూడా అదే జోష్ తో ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా అనే థ్రిల్లర్ తో రాబోతున్నాడు. మెహెర్ తేజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఎలాంటి హడావుడి లేకుండానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. సైకో కిల్లర్‌గా సుహాస్ కనిపించిన తీరు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలను కూడా పెంచేశారు. ఇక తాజాగా…

అన్నాచెల్లెళ్లుగా అవికా, నవీన్ చంద్ర
ఇండస్ట్రీలో అన్నాచెల్లిళ్లు నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలు వచ్చినా ఇప్పుడు అవి కూడా చాలా వరకూ తగ్గిపోయాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా రావడం ఆసక్తికరం. నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో వీరిద్దరూ అన్నాచెల్లెళ్ళు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూాడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'తిమ్మరుసు' కోసం న్యాచురల్ స్టార్
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో ఆకట్టుకున్న సత్యదేవ్ ఇప్పుడు తిమ్మరుసు సినిమాతో వస్తున్నాడు. అసైన్‌మెంట్ వాలి అనేది ఉపశీర్షిక. ఇప్పటికే ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దీంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి. ఇందులో తెలివితేటలున్న లాయర్ రామచంద్ర పాత్రలో సత్యదేవ్ నటించాడు. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ చేసిన మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. ఈరోజు జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు న్యాచురల్ స్టార్ నాని అతిథిగా రానున్నారు.

'తిమ్మరుసు' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే సత్యదేవ్ తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం, నిత్యమీనన్ తో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ స్కై లాబ్ చిత్రాలు చేస్తున్నాడు. ఇక వీటితోపాటు తిమ్మరుసు సినిమా కూడా చేస్తున్నాడు. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో సత్యదేవ్ అడ్వకేట్ రోల్‌లో కనిపించనున్నాడు. మరోవైపు ఈసినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్…

సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్ రిలీజ్
కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. అంతకు ముందు పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో చేసి తనదైన కామెడీతో నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి జోనర్ ను మార్చి ఫ్యామిలీ డ్రామా అనే థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమా మొదలైనట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' ఫస్ట్ లుక్ రిలీజ్
షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయిన సుహాస్.. సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ మెల్లమెల్లగా సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు. మజిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ తో పాటు పలు సినిమాల్లో తన కామెడీతో నవ్వించిన సుహాస్ ఇటీవల హీరోగా కూడా మారాడు. కలర్ ఫొటో సినిమాలో హీరోగా నటించి హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కొత్తసినిమాతో వచ్చేస్తున్నాడు.

"తిమ్మరుసు"ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ , సూపర్ హిట్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగాఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో అసైన్‌మెంట్ వాలి ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్ , బ్రహ్మాజీ , ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

'ఏక్ మినీ కథ' ట్రైలర్ రిలీజ్
‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెరకి పరిచయమై ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రేక్షకుల చేత నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో.. ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతూ ఏక్ మినీ కథ అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆద్యంతం ఫుల్ కామెడీగా ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

'ఏక్ మినీ కథ' అవును పోస్ట్ పోన్
కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్, నటి కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈసినిమాకు కథ అందిస్తున్నాడు. ఓ డిఫరెండ్ కాన్సెప్ట్ తో అయితే ఈ సినిమా వస్తుందని అర్థమవుతుంది. ఇప్పటికే పలు పోస్టర్స్ టీజర్, పాటలతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇటీవలే ఈసినిమా ను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.