‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెరకి పరిచయమై ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రేక్షకుల చేత నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో.. ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతూ ఏక్ మినీ కథ అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి
పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆద్యంతం ఫుల్ కామెడీగా ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A story to entertain, amuse and make mini things work!
Trailer out now: https://t.co/uEMVmLPu2g
Watch #EkMiniKathaOnPrime on May 27, @PrimeVideoIN.@santoshshobhan @KavyaThapar @shraddhadas43 @actorbrahmaji @MerlapakaG @karthikrapol #NelloreSudarshan @SiriRaasi @Plakkaraju pic.twitter.com/cPFm4dbOAU— Telugu FilmNagar (@telugufilmnagar) May 21, 2021
ఇక నిజానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేట్రికల్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్స్ మూతబడటంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చెయ్యడమే బెటర్ అనుకుని ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు.. మే 27 నుండి ‘ఏక్ మినీ కథ’ అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది..
ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్ కీలక పాత్రలో నటిస్తుంది. బ్రహ్మజి, సప్తగిరి, సుదర్శన్, పోసాని కృష్ణమురళి, అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్, ప్రభు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఇప్పుడు ఏక్ మినీ కథ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: