నవీన్ చంద్ర గత కొంత కాలంగా మంచి చిత్రాలు ఎంచుకుని నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని ఫ్యామిలి ఆడియన్స్ లో సంపాదిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే బ్రో అనే మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈసినిమా నేడు సోని లివ్ ఒటిటి లో విడుదలైంది. ఇక ఎప్పటిలాగే ఈమూవీలో కూడా తన నటనతో అందరి హృదయాల్ని ఆకట్టకున్నాడు. తన తరువాత పుట్టిన చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించే అన్న పాత్రలో జీవించాడనే చెప్పాలి. తన చెల్లెలు ఆరోగ్యం కొసం కావల్సిన డబ్బు కోసం దుబాయ్ వెళ్ళి అక్కడే వుంటూ తన కుటుంబాన్ని ముఖ్యంగా తన చెల్లెల్ని అమితం గా ప్రేమించే అన్న పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గుర్తిండిపోతుంది. అలాగే చెల్లెలు గా నటించిన అవికా గోర్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. ఈ పాత్ర లో అన్నయ్యే తనకి అన్ని అని బ్రతికే చెల్లెలు పాత్ర లో అందర్ని అలరించింది. తన జీవితంలో పెద్ద పెనుతుఫాను వచ్చినా తన అన్నకి ఏమి కావాలో అన్ని సమకూర్చే చక్కటి పాత్రలో అవికాగోర్ అందర్ని కవ్వించి కన్నీళ్ళు తెప్పిస్తుంది. అన్నా చెల్లెళ్ళ మద్య ఒక ఢిఫరెంట్ కథనాన్ని దర్శకుడు తీసుకున్నాడు. అలాగే అవివా గోర్ లవ్ స్టోరి అందర్ని ఆకట్టుకుంటుంది. కార్తిక్ తుపురాని తెరకెక్కించిన ఈ చిత్రం సినిమా ప్రేక్షకుల్ని ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సక్సెస్ ఫుల్ టాక్ తో సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని JJR ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై JJR రవిచంద్ నిర్మించారు. భాస్కరభట్ల రాసిన ప్రతి పాట హృదయాన్ని ఆకట్టుకుంటుంది. శేఖర్ చంద్ర సంగీతం అర్దవంతంగా సిట్యూవేషన్ ని బలపరిచేలా వుంది. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ కళ్ళ కి ఆహ్లాదాన్నిస్తుంది. #BRO సినిమాకు విప్లవ్ నైషధం ఎడిటింగ్ చాలా ప్లస్ అయ్యింది. సచిన్ కుందాల్కర్ కథ చాలా కొత్తగా ఎమెషనల్ గా వుంది.
సోనీ లివ్ లో ‘#BRO’ ఫుల్ మూవీ ని వీక్షించండి 👇
ఏక్ మిని కథ లాంటి బ్లాక్‌బస్టర్ తో నిర్మాణ రంగంలొకి అడుగు పెట్టిన మ్యాంగో మాస్ మీడియా తన రెండవ చిత్రంగా #BRO తో రెండవ సక్సెస్ సాధించి సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ గా పేరుసాందించారు. సంస్థ అధినేత రామ్, మ్యాంగ్ మాస్ మాడీయా సంస్థ ద్వారా నూతన దర్శకుల్ని ప్రొత్సహిస్తున్నారు. ఇప్పటికే ఆయన ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి, సూపర్ హిట్ టాక్ అందుకున్న బట్టల రామ స్వామి, ఫ్యామిలీ డ్రామా వంటి చిత్రాలు నూతన దర్శకుల తెరకెక్కించిన సినిమాలే కావడం విశేషం. ఇదే పంథా లో రామ్ #బ్రో వంటి వైవిధ్యమైన చిత్రాన్ని విడుదల చేసి, మరో సక్సెస్ అందుకున్నారు.
నటీనటులు:
నవీన్ చంద్ర, అవికా గోర్ తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కార్తిక్ తుపురాని
నిర్మాత: జేజేఆర్ రవిచంద్
బ్యానర్: జేజేఆర్ ఎంటర్‌టైన్మెంట్స్
సంగీతం: శేఖర్ చంద్ర
లిరిసిస్ట్: భాస్కర భట్ల
సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్
ఎడిటర్: విప్లవ్ నైషధం
Positive responses pouring in from celebs all over!
𝐄𝐦𝐨𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐁𝐥𝐨𝐜𝐤𝐛𝐮𝐬𝐭𝐞𝐫 #BRO 👫🏻💫 Streaming Now on @SonyLIV 🎬🍿
🔗 https://t.co/mkiVG7pa8q#BROonSonyLIV @Naveenc212 @Avika_n_joy @Saironak3 @SanjanaSarathy @Kat_thupurani #ShekarChandra @bhaskarabhatla pic.twitter.com/Ha6Kh6ngne
— Telugu FilmNagar (@telugufilmnagar) November 27, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: