కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్, నటి కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈసినిమాకు కథ అందిస్తున్నాడు. ఓ డిఫరెండ్ కాన్సెప్ట్ తో అయితే ఈ సినిమా వస్తుందని అర్థమవుతుంది. ఇప్పటికే పలు పోస్టర్స్ టీజర్, పాటలతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇటీవలే ఈసినిమా ను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ ఫన్నీ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది చిత్రయూనిట్. హీరో సంతోష్ శోభన్ – కమెడియన్ సుదర్శన్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణలో కరోనా కారణంగా అందరూ సేఫ్ గా ఉండాలని సూచిస్తూ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు మెరుగుపడ్డాక కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని తెలిపారు.
We aren’t stepping out on April 30th.
Yes, #EkMiniKathaPostPoned!!#StayHomeStaySafe #WearAMask#EkMiniUpdate4 ▶️ https://t.co/MeaiU3g6J1 #DoesSizeMatter?@santoshshobhan @KavyaThapar @shraddhadas43 @MerlapakaG @karthikrapol #MangoMassMedia @UVConcepts_ @UV_Creations pic.twitter.com/pGj0F33OIT— UV Creations (@UV_Creations) April 26, 2021
ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్, బ్రహ్మజి, సప్తగిరి, సుదర్శన్, పోసాని కృష్ణమురళి, జబర్దస్త అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్, ప్రభు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఇప్పుడు ఏక్ మినీ కథ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: