
ట్యాగ్ · 43 కథనాలు


టాప్ ప్రొడ్యూసర్స్ తో మహేష్ లంచ్..!
మొన్న బుక్.. నేడు వెబ్ సిరీస్..!
అభిమానులకు మహేష్ బాబు థ్యాంక్స్
మరోసారి 'రియల్ హీరో' అనిపించుకున్న మహేష్..!
హీరో కృష్ణ కు మహేష్ బాబు ఫాదర్స్ డే శుభాకాంక్షలు

OFFICIAL..పరుశురాంతోనే మహేష్ సినిమా
ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మహేష్

త్వరలో SSMB 27 మూవీ అనౌన్స్ మెంట్
'మాస్క్ ఇండియా' అంటున్న మహేష్..!
మహేష్-గౌతమ్ ల హైట్ చెక్..!
మాస్క్ ధరించడం తప్పనిసరి..!

మహేష్ బాబు పర్సనల్ జిమ్

ఫార్ములా ఈ రేస్ కై ఆసక్తితో ఎదురుచూస్తున్న మహేష్ బాబు
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా #SSMB 28 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న#SSMB 29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

టాప్ ప్రొడ్యూసర్స్ తో మహేష్ లంచ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గానే సర్కారు వారి పాట సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఒక సినిమా అయిపోయిన తరువాత వెంటనే వెకేషన్ కు వెళ్లడం మహేష్ కు అలవాటే. ఇక సర్కారు వారి పాట సినిమా తరువాత కూడా మహేష్ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను, వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అక్కడ స్వీట్ మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉన్నారు. రీసెంట్‌గా మహేష్ యూరప్‌లో రోడ్ ట్రిప్‌లో ఉన్నపుడు నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి సెల్పీ దిగి నెట్టింట్లో పోస్ట్ చేయగా ఫుల్ గా వైరల్ అయింది.
'దుబాయ్' లో సర్కారు వారి పాట
గత ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ వెంటనే 'సర్కారు వారి పాట' సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ మాత్రం ఇన్నిరోజులు పెండింగ్ లో పడిపోయింది. ఇక ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్లు మొదలు పెట్టి పూర్తి చేసి కొన్ని సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి.
మొన్న బుక్.. నేడు వెబ్ సిరీస్..!
సూపర్‌స్టార్ మహేశ్ లాక్‌డౌన్ సమయంలో పిల్లలతో సరదాగా సమయాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా పుస్తకాలు కూడా చదువుతూ కాలక్షేపం చేస్తున్నాడు. మొన్నామధ్య 'ఎమోషనల్ ఇంటెలిజన్స్' పుస్తకం చదవమని మహేష్ సూచించిన సంగతి తెలిసిందే. 'ఎమోషనల్ ఇంటెలిజన్స్.. సైంటిఫిక్ .. సంచలనాత్మకం.. అందరూ చదవాల్సిన పుస్తకం. ఇక ఈ వారం అంతా డానియల్ గోల్ మెన్ కే కేటాయిస్తున్నా..' అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ చూడమని చెపుతున్నాడు. ‘డార్క్’ అనే పేరుతో తెరకెక్కిన జర్మన్ వెబ్ సిరీస్‌ను చూశానని, రచన, దాన్ని తీసిన తీరు అత్యద్భుతంగా ఉన్నాయని మహేశ్ తెలిపారు. అంతే కాకుండా ఈ…
రియల్ హీరో అనిపించుకున్న మహేష్ - మేకప్ మెన్ కు బర్త్ డే విషెస్..!
కొంతమంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలనిపించుకుంటారు. ఆ వరుసలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుటాడు. తన కుటుంబానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. తన చుట్టు పక్కన ఉన్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటాడు. తోటి నటీనటులతో పాటు తన దగ్గర పనిచేసే వారికి ఎంతో మర్యాద ఇస్తుంటారు మహేష్. తాజాగా మరోసారి అది ప్రూవ్ చేసాడు మహేష్.
అభిమానులకు మహేష్ బాబు థ్యాంక్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం ప్రారంభంలోనే "సరిలేరు నీకెవ్వరు " వంటి బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ తో మహేష్ బాబు రికార్డ్స్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు మహేష్ బాబు , అభిమానులకు అనేక జాగ్రత్తలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.. అలర్ట్ చేస్తుంది..!
లాక్ డౌన్ నుండి ఎప్పుడైతే సడలింపులు చేశారో... అప్పటినుండి రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీనితో ఎవరికి వాళ్ళు జాగ్రతలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇక ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్నో సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి పలు సూచనలు చేశారు. నిజానికి కరోనా ప్రారంభమైనప్పటి నుండి సోషల్ మీడియా ద్వారా పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాస్క్‌లు ధరిస్తూ, వీలైనంతగా భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే ఎన్నో వీడియోలలో ఆయన చెప్పి ఉన్నారు.
మరోసారి 'రియల్ హీరో' అనిపించుకున్న మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే సాయం గురించి ఎవరితో చెప్పుకోరు అన్న సంగతి తెలిసిందే. ఎంతో మందికి తాను సాయం చేశాడు. కానీ ఏరోజు తాను చేసిన సాయం గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అది మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో సామజిక సేవల్లో పాల్గొంటూనే ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు.. చిన్న పిల్లలకు ఎలాంటి విపత్తు వచ్చినా తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు...
లేడీ అమితాబ్ విజయశాంతి కి మహేష్ బర్త్ డే శుభాకాంక్షలు
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయ శాంతి ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. అత్యధిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి విజయ శాంతి రికార్డ్ క్రియేట్ చేశారు . 3 దశాబ్దాల సినీ కెరీర్ లో 180 మూవీస్ కు పైగా నటించి, ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ హోదాను విజయశాంతి దక్కించుకున్నారు. హీరోలతో పోటీపడి రెమ్యునరేషన్ అందుకున్న విజయశాంతి "నాయుడమ్మ "మూవీ (2006 ) తరువాత సినిమాలకు దూరం అయ్యారు.
హీరో కృష్ణ కు మహేష్ బాబు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫాదర్ హీరో కృష్ణ కు ఫాదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ తరువాత మహేష్ బాబు , సూపర్ హిట్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
గొప్ప నటుడిగా.. మంచి తండ్రిగా.. గొప్ప భర్తగా గుర్తుపెట్టుకోవాలని నా కోరిక..!
ఇన్ని రోజులు తమ హీరో సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు మహేష్ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. తన తర్వాత పరుశురాం దర్శకత్వంలో ఉండబోతుందని చెప్పిన చిత్రయూనిట్... నిన్న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నిన్న మహేష్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. మరి…

OFFICIAL..పరుశురాంతోనే మహేష్ సినిమా
ఒకదాని తర్వాత ఒకటి మహేష్ బాబు ఫ్యాన్స్ కు సర్పరైజ్ ఇస్తున్నారు. రేపు ఆయన తన అభిమానులతో ముచ్చటించనున్నట్టు ఇప్పటికే తెలిపారు. రేపు సూపర్ కృష్ణ పుట్టినరోజు కావడంతో మహేష్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం మొదలుకానుంది.
ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మహేష్
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో గడుపుతున్నాడు. మామూలుగానే సినిమా షూటింగ్‌ల సమయంలో ఏ కాస్త విరామం దొరికినా తన ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. ఇక ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో తన పిల్లలతో కలిసి చేసే అల్లరి పనులను ఎప్పటికప్పుడు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తునే ఉన్నారు. ఇక మహేష్ బాబు తన పిల్లలతో చేసే అల్లరి.. తనలో ఉన్న మరో యాంగిల్ ను చూసి అభిమానులు ఇప్పటికే ముచ్చటపడిపోతున్నారు.

త్వరలో SSMB 27 మూవీ అనౌన్స్ మెంట్
వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ తరువాత తాను నటించే మూవీ ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. సూపర్ హిట్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో SSMB 27 మూవీ రూపొందనుంది.
'మాస్క్ ఇండియా' అంటున్న మహేష్..!
కరోనా మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . ఈ కరోనా వైరస్ వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలతో పోరాడుతున్నారు.ప్రస్తుతం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు చేసారు కానీ దీనివల్ల కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మనకి మనమే జాగ్రత్తలు తీసుకోవాలని.. బయటకు వెళ్తే మాస్క్ లు తప్పనిసరి అని శానిటైజర్లు కూడా ముఖ్యమని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇదే అంశంపైన సెలబ్రిటీలు కూడా తమ వంతు భాధ్యతగా కరోనా పై జాగ్రత్తలు చెబుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

డిస్కవరీ ఛానల్ కు ప్రకాశ్ రాజ్ గాత్ర దానం..ఎదురుచూస్తుంటాం అన్న మహేష్
డిస్కవరీ ఛానల్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అద్భుతమైన సన్నివేశాల్ని అరుదైన సన్నివేశాలను.. చూపించడం ఈ ఛానల్ స్పెషాలిటీ. అందుకే ఈ ఛానల్ కు చాలా మంది ఫెవెరెట్స్ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు జాతీయ బాషలకే పరిమితమవ్వగా ఇప్పుడు ప్రాంతీయ ప్రజలకు కూడా దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే సరికొత్త ప్లాన్ తో వచ్చింది డిస్కవరీ ఛానల్. అనేక భాషల్లో తన వీక్షకులను పెంచుకునేందుకు రోజు రోజుకు మరింత ప్రయత్నాలు చేస్తుంది.
మహేష్-గౌతమ్ ల హైట్ చెక్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటాడు.తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు మహేష్. అలాంటిది ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటూ సితార, గౌతమ్ లతో కలిసి ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
మాస్క్ ధరించడం తప్పనిసరి..!
లాక్ డౌన్ నాలుగోసారి కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో లాగ కాకుండా కొన్ని సడలింపులు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. షూటింగ్స్ కు కూడా కొన్నిషరతులతో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికే అనుమతులు ఇచ్చారు.

మహేష్ బాబు పర్సనల్ జిమ్
"భరత్ అనే నేను", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు " వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంటిలో మహేష్ బాబు పర్సనల్ జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ తన జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తారు.
సితార కోసం మహేష్ పాట..!
లాక్ డౌన్ లో మహేష్ బాబు తన అభిమానులకు సూపర్ ఫన్ ఇస్తున్నారు. మహేష్ బాబు,సితార ల వీడియో లు రోజుకొకటి విడుదల చేస్తూ అభిమానులకు మహేష్ లో ఉన్న మరో యాంగిల్ ను చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోగా... తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయ సితారతో చిన్నపిల్లాడిలా మారిపోయి డెడ్డీ బెర్రీతో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది నమ్రత. ఇక ఈ వీడియోతో పాటు నమ్రత మెసేజ్ పోస్టు చేస్తూ… ‘ప్రేమ, జీవితం మరియు నవ్వు.. మహేష్ – సితు పాప మధ్య చిన్న టెడ్డీ కచేరీ. ఇక సితార మాత్రమే మహేష్ లో ఉన్న చిన్నపిల్లాడిని బయటకు తీసుకురాగలదు’అని పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో లో మహేష్ సీతారాతో ఆడటమే…