సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గానే సర్కారు వారి పాట సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఒక సినిమా అయిపోయిన తరువాత వెంటనే వెకేషన్ కు వెళ్లడం మహేష్ కు అలవాటే. ఇక సర్కారు వారి పాట సినిమా తరువాత కూడా మహేష్ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను, వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అక్కడ స్వీట్ మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉన్నారు. రీసెంట్‌గా మహేష్ యూరప్‌లో రోడ్ ట్రిప్‌లో ఉన్నపుడు నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి సెల్పీ దిగి నెట్టింట్లో పోస్ట్ చేయగా ఫుల్ గా వైరల్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా నమ్రతా తన సోషల్ మీడియా ద్వారా మరో ఫొటో ను పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు గుడ్ ఫుట్, గుడ్ ఫన్, గుడ్ టైమ్స్ అంటూ క్యాఫ్షన్ కూడా ఇచ్చారు. ఇక ఆ ఫొటోలో మహేష్, నమ్రతతో పాటు టాప్ ప్రొడ్యూసర్స్ ఉండటం విశేషం. ఏకే ఎంటర్ టైన్మెంట్ సంస్థ అధినేత, అలానే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆ ఫొటోలో ఉన్నారు.
View this post on Instagram




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: