ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 96
'చెక్' - ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020
మొన్న మహేష్ - నేడు తలైవా

5 భాషల్లో విజయ్ ఆంటోనీ 'విజయరాఘవన్' టీజర్ రిలీజ్
బన్నీ, రానా కు 'బ్రహ్మీ' బహుమతి
"లక్ష్య "మూవీ అప్ డేట్
'రంగ్ దే' రిలీజ్ డేట్ ఫిక్స్
"ఆచార్య "మూవీ కి భారీ టెంపుల్ టౌన్ సెట్
సీనియర్ నటుడు 'నర్సింగ్ యాదవ్' కన్నుమూత
'క్రాక్ ట్రైలర్' - నో డౌట్.. ష్యూర్ షాట్
అభినవ శకుంతల సమంత

పోల్ గేమ్ : యాక్షన్ హీరో గోపీచంద్ బెస్ట్ మూవీ ?

రజినీ పొలిటిల్ ఎంట్రీ పై మోహన్ బాబు రియాక్షన్

2020 ఎండింగ్ ఫొటో - థ్యాంక్స్ అన్నయ్య
స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తూ కీర్తి సురేష్
'రాధే శ్యామ్' - రాధా కృష్ణ క్రేజీ పోస్ట్
రవితేజ "ఖిలాడి "మూవీ అప్ డేట్
'మహర్షి'లా మారిన డేవిడ్ వార్నర్
బెస్ట్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య ఫ్రెండ్ షిప్ అరుదుగా ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ శృతి హాసన్ , తమన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. తమన్నా ప్రస్తుతం పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. శృతి హాసన్ 2 తెలుగు , ఒక తమిళ మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేసి హాలీ డేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. శృతి హాసన్ , తమన్నా తమ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి పలు ఇంటర్వూస్ లో చెప్పిన విషయం తెలిసిందే.
'చెక్' - ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్
ఈ ఏడాది హీరో నితిన్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘రంగ్ దే’ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020 లో టాలీవుడ్లో గెలుచుకున్న అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ "ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. "జెర్సీ "మూవీ బెస్ట్ ఫిల్మ్ గా అవార్డ్ గెలుచుకుంది. సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ"మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరో నవీన్ పోలిశెట్టి బెస్ట్ యాక్టర్ గా ఎంపిక అయ్యారు.
మొన్న మహేష్ - నేడు తలైవా
క్రికెట్ లో తన ఆటతో ఎలా మెప్పిస్తాడో.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే సందడి చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. మొన్న మహేష్ 'మహర్షి' సినిమాలో సీన్స్ తో అదరగొట్టిన వార్నర్ ఇప్పుడు తలైవాగా మారిపోయాడు. రీ ఫేస్ యాప్ ద్వారా 'మహర్షి' సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్‌గా మారి అభిమానులను ఆకట్టుకున్న వార్నర్ ఇప్పుడు రజినీ కాంత్ 'దర్బార్' సినిమాలో కొన్ని సన్నివేశాలకు రజినీకాంత్‌కు బదలు తన ఫేస్‌ను యాడ్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ.. చాలా మంచి రిక్వెస్ట్ మేరకు ఇది చేశానని చెబుతూ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలను తెలియజేశాడు.

5 భాషల్లో విజయ్ ఆంటోనీ 'విజయరాఘవన్' టీజర్ రిలీజ్
విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు.
బన్నీ, రానా కు 'బ్రహ్మీ' బహుమతి
నవ్వుల రారాజు బ్రహ్మీ కామెడీ గురించి కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఆయన నటన గురించి అందరికీ తెలుసు కానీ చిత్ర కారుడు అన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అయితే హాస్య కళతో పాటు బ్రహ్మీలో మరొక కళ కూడా ఉందన్న సంగతి ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఏదో చిత్రాలు వేసాం అన్నట్టు కాదు.. బ్రహ్మీ వేసిన చిత్రాలు చూస్తే ఆయనలో ఎంత ప్రతిభ ఉందో చెప్పొచ్చు. జీవం ఉట్టిపడేలా ఉన్నాయి ఆయన వేసిన చిత్రాలు చూస్తుంటే. చిత్రకళ పట్ల ఆయనకున్న తృష్ణ కనిపిస్తుంది. మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు 'ఆంజనేయుని ఆనంద భాష్పాలు' పేరుతో చిత్రం గీశారు. ఆ…
"లక్ష్య "మూవీ అప్ డేట్
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా విలు విద్య నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక కాగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
'రంగ్ దే' రిలీజ్ డేట్ ఫిక్స్
అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్.. కరోనా కారణంగా కొన్ని నెలలు బ్రేక్ రాగా తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మార్చి 26వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
"ఆచార్య "మూవీ కి భారీ టెంపుల్ టౌన్ సెట్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ గా "ఆచార్య" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా సోనూ సూద్ , సక్సెస్ ఫుల్ యాంకర్ అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
సీనియర్ నటుడు 'నర్సింగ్ యాదవ్' కన్నుమూత
2020లో కరోనా వల్ల సినీ ఇండస్ట్రీకిభారీ నష్టం జరిగితే.. ఇక ఎంతో మంది సెలెబ్రిటీస్ ను కూడా బలిగొంది. చిన్న నటుల దగ్గర నుండి లెజెండరీ నటులవరకూ ఎంతో మంది మరణించారు. ఇక ఏడాది చివరి రోజు కూడా ఒక నటుడు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఆ నటుడు ఎవరో కాదు ఎన్నో తెలుగు సినిమాలో నటించిన నర్సింగ్ యాదవ్.
'క్రాక్ ట్రైలర్' - నో డౌట్.. ష్యూర్ షాట్
మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులకు న్యూ ఇయర్ కి మంచి ట్రీటే లభించింది అని చెప్పొచ్చు. రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను ఇంకారెట్టింపు చేసింది అని చెప్పుడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం.. గతంలో పాత రవితేజ కనిపించాడు మళ్లీ ఈ సినిమాతో అన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
అభినవ శకుంతల సమంత
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతం ఆది పర్వం లోని శకుంతల -దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా "శాకుంతలం "మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం" బ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రణయకావ్యం గా రూపొందుతున్న "శాకుంతలం "మూవీ లో కథానాయికగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

పోల్ గేమ్ : యాక్షన్ హీరో గోపీచంద్ బెస్ట్ మూవీ ?
ఈతరం ఫిల్మ్స్ బ్యానర్ పై ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "యజ్ఞం " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో గోపీచంద్ తీక్షణ లుక్స్ , బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ , కామెడీ టైమింగ్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించారు.

రజినీ పొలిటిల్ ఎంట్రీ పై మోహన్ బాబు రియాక్షన్
ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు . అయితే ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నానని.. డిసెంబర్ 31న తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తానని, జనవరిలో పార్టీని స్టార్ట్ చేస్తానని ఆయన తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మరో ట్విస్ట్ ఇచ్చారు రజినీ. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ ట్విట్టర్ వేదికగా ఒక లేఖను విడుదల చేశారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు…

2020 ఎండింగ్ ఫొటో - థ్యాంక్స్ అన్నయ్య
కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఓటీటీ లో రిలీజ్ అయిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. రీసెట్ గా గువ్వ గోరింక అనే సినిమాను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.
స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తూ కీర్తి సురేష్
బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల మూవీస్ తో కీర్తి బిజీగా ఉన్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో కీర్తి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీర్తి ప్రస్తుతం నితిన్ "రంగ్ దే !", రజనీకాంత్ "అన్నాత్తే ", మోహన్ లాల్ "మరక్కార్ " మూవీస్ లో నటిస్తున్నారు. మహేష్ బాబు "సర్కారు వారి పాట " మూవీ లో కీర్తి కథానాయికగా ఎంపిక అయ్యారు.
'రాధే శ్యామ్' - రాధా కృష్ణ క్రేజీ పోస్ట్
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వుంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు.. ఈ సినిమా కోసం ఎంత మందిఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం.. టీజర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
రవితేజ "ఖిలాడి "మూవీ అప్ డేట్
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. పలు మూవీస్ కు పోటీగా "క్రాక్ " మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. "క్రాక్ " మూవీ విజయం పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఈ మూవీ తరువాత హీరో రవితేజ మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
బిగ్ బాస్ 4 - నెవర్ బిఫోర్ టీఆర్ఫీ
తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటి వరకు తెలుగులో ఇంత భారీ బడ్జెట్ షో రాలేదు. దీనికి తోడు తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత కావడంతో మరింత పాపులారిటీ వచ్చింది. సీజన్ 2 కు నాని, సీజన్ 3, 4 కి నాగార్జున లాంటి స్టార్స్ వ్యాఖ్యతలుగా చేయడంతో ఈ షోకి మరింత క్రేజ్ పెరిగింది.
'మహర్షి'లా మారిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు . అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలకు ఫ్యామిలీతో చిందేసి అల్లు అర్జున్‌తో పాటు అతని అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దానితో ఆగకుండా.. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే 'నా మాట నేనే వినను' అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్‌ను అందుకున్నాడు. అనంతరం బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే…