‘రాధే శ్యామ్’ – రాధా కృష్ణ క్రేజీ పోస్ట్

actor prabhas, Hero Prabhas, latest telugu movies news, Latest Tollywood News, Pooja Hegde Radhe Shyam, Prabhas, Radha Krishna Kumar Hint At An Update On New Year, Radhe Shyam, Radhe Shyam Film, Radhe Shyam Movie, Radhe Shyam Movie Shoot, Radhe Shyam Movie Shoot News, Radhe Shyam Movie Shoot updates, Radhe Shyam Movie Team, Radhe Shyam Movie Telugu, Radhe Shyam Sets, Radhe Shyam Telugu Movie, Rebel Star Prabhas, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood, Tollywood Movie Updates

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వుంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు.. ఈ సినిమా కోసం ఎంత మందిఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం.. టీజర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా నుండి న్యూ ఇయర్ కి ఏ అప్ డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో రాధా కృష్ణ ఈ సినిమాపై ఓ ఆసక్తికర పోస్ట్ వచ్చింది. తన ఇన్స్టాగ్రమ్ లో ఈ వచ్చే కొత్త సంవత్సరం 2021లో లవ్ అండ్ రొమాన్స్ కు వెల్ కమ్ చెపుదాం అని పోస్ట్ పెట్టారు. దీని బట్టి చూస్తే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ పక్కా ఉంటుందని అర్ధమవుతుంది. మరి ఫ్యాన్స్ కు ఈ అప్ డేట్ అయితే సరిపోదు. ఖచ్చితంగా సాలిడ్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తారు. మరి చూద్దాం న్యూ ఇయర్ కి ఇంకేదైనా అప్ డేట్ ఇస్తారేమో.

కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.