క్రికెట్ లో తన ఆటతో ఎలా మెప్పిస్తాడో.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే సందడి చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. మొన్న మహేష్ ‘మహర్షి’ సినిమాలో సీన్స్ తో అదరగొట్టిన వార్నర్ ఇప్పుడు తలైవాగా మారిపోయాడు. రీ ఫేస్ యాప్ ద్వారా ‘మహర్షి’ సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్‌గా మారి అభిమానులను ఆకట్టుకున్న వార్నర్ ఇప్పుడు రజినీ కాంత్ ‘దర్బార్’ సినిమాలో కొన్ని సన్నివేశాలకు రజినీకాంత్‌కు బదలు తన ఫేస్‌ను యాడ్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ.. చాలా మంచి రిక్వెస్ట్ మేరకు ఇది చేశానని చెబుతూ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలను తెలియజేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ వల్ల క్రికెట్ లేకపోవడం వలన ఇంటికి పరిమితమైన వార్నర్ తన భార్య, పిల్లలతో కలిసి డ్యాన్స్‌లు చేయడం, పాపులర్ సినిమా డైలాగులకు తనదైన స్టైల్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం వంటివి చేస్తూ నెటిజన్స్‌ని ఎంతగానో అలరించాడు. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: