5 భాషల్లో విజయ్ ఆంటోనీ ‘విజయరాఘవన్’ టీజర్ రిలీజ్

Vijaya Raghavan Movie Teaser To Be Out In 5 Different Languages,Vijaya Raghavan Movie,Vijaya Raghavan,Vijaya Raghavan Film,Vijaya Raghavan Teaser,Vijaya Raghavan Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijaya Raghavan Movie Teaser In 5 Languages,India First Ever Film Teaser In 5 Languages,Vijaya Raghavan Telugu Teaser,Vijay Antony,Aathmika,Ananda Krishnan,Nivas K Prasanna,Official Teaser Of Vijaya Raghavan,Vijaya Raghavan Movie Teaser Out,Vijay Antony Vijaya Raghavan Movie Teaser Out,Actor Vijay Antony

విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీటితోపాటు విజయరాఘవన్ సినిమా చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ. మెట్రో వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళ్ లో ‘కోడియిల్‌ ఒరువన్’ సినిమా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో ‘విజయ రాఘవన్‌’గా విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ సరసన ఆత్మిక హరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరువుకుంటుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + twelve =